తెలంగాణ

telangana

ETV Bharat / bharat

చెట్టుపైనే వృద్ధ దంపతుల నివాసం- ఎందుకంటే...? - ఉదల్గురి ఏనుగుల దాడి

అసోంలో ఏనుగుల బెడద గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆహారం కోసం అక్కడ గజరాజులు ఇళ్లపై విరుచుకుపడుతుంటాయి. ఉదల్గుడీ జిల్లాలోనూ ఇదే జరిగింది. ఏనుగుల గుంపు ఓ వృద్ధ దంపతుల నివాసంపై దాడి చేశాయి. వేరే గత్యంతరం లేక వారు గత కొద్దిరోజులుగా ఓ చెట్టుపైనే తలదాచుకుంటున్నారు.

అసోం: గజరాజుల బీభత్సం.. చెట్టుపైనే జీవనం

By

Published : Nov 20, 2019, 5:05 PM IST

Updated : Nov 20, 2019, 6:15 PM IST

చెట్టుపైనే వృద్ధ దంపతుల నివాసం- ఎందుకంటే...?

అసోంలో ఏనుగులు... పంటపొలాలపై, మనుషులపై గుంపులు గుంపులుగా విరుచుకుపడి దాడి చేస్తుంటాయి. ఇప్పుడు ఉదల్గుడీ జిల్లాలో ఓ వృద్ధ దంపతుల ఇంటిపై గజరాజులు దాడి చేశాయి. ఇంటిని పూర్తిగా ధ్వంసం చేసి వెళ్లిపోయాయి.

అదృష్టవశాత్తు ప్రాణాలతో బతికి బయటపడినప్పటికీ వారు తలదాచుకోవటానికి కాస్తంత నీడ లేకుండాపోయింది.

చెట్టుపైనే జీవనం..

వేరే గత్యంతరం లేక ఏనుగుల నుంచి తప్పించుకోవటానికి కొద్ది రోజులుగా ఓ చెట్టుపై ఉండాలని నిశ్చయించుకున్నారా దంపతులు. వారి పెంపుడు జంతువులతో సహా చెట్టుపైనే గత పన్నెండు రోజులుగా జీవనం సాగిస్తున్నారు. ఆకలితో అలమటిస్తున్న వారిని చూసి స్థానికులు కొందరు ఆహారం అందిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తమను ఆదుకోవాలని ఆ వృద్ధ దంపతులు గోడు వెళ్లబోసుకుంటున్నారు.

ఇదీ చూడండి : 105 ఏళ్ల వయస్సులో 'అఆ'ల పరీక్షకు హాజరైన బామ్మ

Last Updated : Nov 20, 2019, 6:15 PM IST

ABOUT THE AUTHOR

...view details