తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'బాండ్లతో ఎన్నికల రాజకీయంలోకి అవినీతి రహిత నగదు' - ఎలక్టోరల్​ బాండ్ల

ఎలక్టోరల్​ బాండ్లతో ఎన్నికల రాజకీయంలోకి అవినీతి రహిత నగదు వస్తుందన్నారు కేంద్ర మంత్రి పీయూష్​ గోయల్​. ఎన్నికల్లో ఓటమిపాలై నిరాశ చెందిన అవినీతి రాజకీయ నాయకుల కూటమే.. ఎన్నికల బాండ్లపై విమర్శలు చేస్తోందని ఆరోపించారు కేంద్ర మంత్రి. ఎన్నికల నిధుల్లో అవినీతి రహిత, పన్నులు చెల్లించే పారదర్శక నగదు తీసుకురావటం వారికి ఇష్టం లేదన్నారు.

కేంద్ర మంత్రి పీయూష్​ గోయల్

By

Published : Nov 21, 2019, 10:07 PM IST

ఎన్నికల బాండ్ల అంశంలో కేంద్రంపై విమర్శలు చేస్తున్న విపక్ష పార్టీల వైఖరిని తప్పుపట్టారు కేంద్ర మంత్రి పీయూష్​ గోయల్​. వారిని 'ఎన్నికల్లో ఓటమిపాలై నిరాశ చెందిన అవినీతి రాజకీయ నాయకుల కూటమి'గా అభివర్ణిస్తూ.. తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్నికల నిధుల్లో అవినీతి రహిత, పన్నులు చెల్లించే పారదర్శక నగదు తీసుకురావటం వారికి ఇష్టం లేదని విమర్శించారు.

"ఎన్నికల రాజకీయంలోకి ఎలక్టోరల్​ బాండ్లు అవినీతి రహిత నగదును తీసుకొచ్చాయి. ఎన్నికల బాండ్లకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నవారు నల్లధనానికి అలవాటు పడ్డారు. ఎన్నికల సమయంలో నల్లధనాన్ని వినియోగించడాన్ని నమ్ముతారు."
- పీయూష్​ గోయల్​, కేంద్ర మంత్రి.

ఎన్నికల సంఘం సిఫార్సుల మేరకు ఎన్నికల్లో రూ.2 వేలకు పైగా నగదు విరాళాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం రద్దు చేసిందని గుర్తు చేశారు పీయూష్​ గోయల్​. గత ఎన్నికల సమయాల్లో కాంగ్రెస్​ నాయకుల నుంచి కోట్ల రూపాయలు ఈసీ స్వాధీనం చేసుకుందని విమర్శించారు. నల్లధనానికి వ్యతిరేకంగా భాజపా మాత్రమే పోరాడుతోందన్నారు గోయల్​. ఎన్నికల రాజకీయంలో అవినీతి రహిత, స్వచ్ఛమైన నగదును తీసుకొస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చూడండి: ఎన్నికల బాండ్లపై కాంగ్రెస్​ ఆందోళన- వెల్​లోకి వెళ్లి నినాదాలు

ABOUT THE AUTHOR

...view details