తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఎలక్టోరల్​ బాండ్స్​.. దశాబ్దంలోనే అతిపెద్ద కుంభకోణం' - చిదంబరం తాజా వార్తలు

ఎలక్టోరల్​ బాండ్స్​ విధానాన్ని తీవ్రస్థాయిలో విమర్శించారు కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం. ఎలక్టోరల్ బాండ్స్​ను దశాబ్దంలోనే అతిపెద్ద కుంభకోణమని అభివర్ణించారు.

BONDS-CHIDAMBARAM

By

Published : Nov 24, 2019, 6:11 AM IST

దాతల పేర్లను తెలుసుకునేందుకే ఎలక్టోరల్​ బాండ్స్​ను తీసుకొచ్చారని భాజపా ప్రభుత్వాన్ని విమర్శించారు కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం. దాతల పేర్లు బ్యాంకులకు తెలిస్తే.. ప్రభుత్వానికి తెలిసినట్లేనని తెలిపారు.

ఐఎన్​ఎక్స్ మీడియా కేసులో జైలులో ఉన్న ఆయన.. కుటుంబ సభ్యుల ద్వారా ఎలక్టోరల్ బాండ్స్​పై స్పందించారు.

పి.చిదంబరం ట్వీట్లు

"ఈ దశాబ్దంలోనే ఎలక్టోరల్ బాండ్స్ అతిపెద్ద కుంభకోణం. దాతలు బ్యాంకులకు తెలుస్తుంది. అంటే ప్రభుత్వానికి తెలిసినట్లే. విరాళం అందించిన దాత వివరాలు ఆ పార్టీ(భాజపా)కి తెలుస్తాయి. ఆ పార్టీకి విరాళం ఇవ్వని వారి వివరాలు కూడా తెలుస్తాయి. మీ పారదర్శకత వర్ధిల్లాలి. "

- పి.చిదంబరం, కేంద్ర మాజీ మంత్రి

ABOUT THE AUTHOR

...view details