సార్వత్రిక ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఉదయం నుంచే ఓటు వినియోగానికి లైన్లలో వేచి ఉన్నారు ఓటర్లు. మొత్తం 91 లోక్సభ స్థానాలకు తొలిదశలో పోలింగ్ జరుగుతుంది. 1,279 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 14 కోట్ల 20 లక్షల 54 వేల మంది ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు.
మొత్తం 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో తొలిదశ పోలింగ్ మొదలైంది. ఎన్నికల కోసం పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు అధికారులు. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిపెట్టారు. పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలతో నిఘా పెట్టారు.
తెలుగు రాష్ట్రాల్లో...
ఆంధ్రప్రదేశ్ -25, తెలంగాణ- 17 కలిపి మొత్తం 42 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. మొదటి విడతలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగియనున్నాయి. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు.
యూపీలో భద్రత నడుమ...