తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భారత్ ​భేరి: 'ప్రాంతీయ' కోటలు దక్కేదెవరికి? - Vidhan Sabha Elections

ఒడిశా, సిక్కిం... రెండూ ఎంతో ప్రత్యేకం. ఒక రాష్ట్రంలో 19 ఏళ్లుగా ఒకరిదే అధికారం. మరో రాష్ట్రంలో ఏకంగా 24ఏళ్లుగా ముఖ్యమంత్రి మారలేదు. ఇప్పుడు ఈ రెండు రాష్ట్రాల శాసనసభలకు లోక్​సభతోపాటే ఎన్నికలు.  ప్రజలు మళ్లీ వారికే జైకొడతారా లేక మార్పు కోరుకుంటారా అన్నది ఆసక్తికరం.

భారత్ ​భేరి: 'ప్రాంతీయ' కోటలు దక్కేదెవరికి?

By

Published : Apr 9, 2019, 4:56 PM IST

భారత్ ​భేరి: 'ప్రాంతీయ' కోటలు దక్కేదెవరికి?

సార్వత్రిక సమరం అంటే దేశమంతా సందడే. కేంద్రంలో ఎవరు అధికారంలోకి వస్తారు? ఏం చేస్తారు? అని నెలలపాటు చర్చ. లోక్​సభ ఎన్నికలకు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలూ తోడైతే? రాజకీయ చర్చలకు అవధులు ఉండవు. దేశంలోని 4 రాష్ట్రాల్లో ప్రస్తుతం అదే పరిస్థితి.

2014లో 5 రాష్ట్రాల శాసనసభలకు లోక్​సభతోపాటే ఎన్నికలు జరిగాయి. అప్పుడు దాదాపు అన్ని చోట్లా ప్రాంతీయ పార్టీలదే హవా. తెలంగాణ ముందస్తు ఎన్నికలకు వెళ్లగా... ఆంధ్రప్రదేశ్​, ఒడిశా, అరుణాచల్​ ప్రదేశ్​, సిక్కింకు ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి. గురువారం పోలింగ్​. ఈసారి ఏం జరుగుతుందన్నది ఆసక్తికరం.

ఒడిశా....

ఒడిశాలో బలమైన నేత నవీన్​ పట్నాయక్​. ఈయన సారథ్యంలోని బిజూ జనతా దళ్​ పార్టీ 19 ఏళ్లుగా అధికారంలో ఉంది. ఒడిశాపై భాజపా భారీ ఆశలు పెట్టుకుంది. ఇక్కడ ప్రధాన పోటీ ఈ రెండు పార్టీల మధ్యే ఉండనుంది.

ఒడిశాలో మొత్తం నాలుగు విడత​ల్లో ఎన్నికలు జరగనున్నాయి.

భారత్ ​భేరి: 'ప్రాంతీయ' కోటలు దక్కేదెవరికి?

ఇదీ చూడండి: పట్నాయక్ లక్ష్యం​ 'పాంచ్​ పటాకా'

అరుణాచల్​ప్రదేశ్​...
అరుణాచల్ ​ప్రదేశ్​లో ప్రధాన పోటీ భాజపా, కాంగ్రెస్ మధ్యే. 1978లో జనతా పార్టీ గెలవడం మినహా.. ఇప్పటివరకు 8 సార్లు జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్​దే విజయం. 2014లోనూ అతిపెద్ద పార్టీగా అవతరించి ప్రభుత్వం ఏర్పాటుచేసింది. 2016లో తలెత్తిన రాజకీయ సంక్షోభంతో పరిస్థితి తారుమారైంది. అధికారం భాజపా వశమైంది. ఈ ఎన్నికల్లో గెలిచి.. ఒకప్పటి వైభవాన్ని తిరిగి సొంతం చేసుకోవాలని ఆశిస్తోంది హస్తం పార్టీ. అధికారం నిలబెట్టుకునేందుకు అంతే దీటుగా పనిచేసింది కమలదళం.

అరుణాచల్​ ప్రదేశ్​లో తొలి దశలోనే అన్ని స్థానాలకు పోలింగ్​ పూర్తి కానుంది.

భారత్ ​భేరి: 'ప్రాంతీయ' కోటలు దక్కేదెవరికి?

ఇదీ చూడండి: భారత్​ భేరి: అరుణాచల్​ పీఠం ఎవరిది?

సిక్కిం...

శాసనసభ ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో సిక్కిం ఎంతో ప్రత్యేకం. ఇక్కడ 1994 నుంచి పవన్​ చామ్లింగ్​ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈయన నేతృత్వంలోని సిక్కిం డెమొక్రటిక్​​ ఫ్రంట్​ పార్టీ(ఎస్​డీఎఫ్​)కి సిక్కిం క్రాంతికారి మోర్చా(ఎస్​కేఎం)కు మధ్య పోటీ ఉండనుంది.

జాతీయ పార్టీలను సిక్కిం ప్రజలు ఎప్పుడూ ఆదరించలేదు. ఈసారైనా వారి హృదయాలు గెలుచుకునే లక్ష్యంతో పనిచేశాయి భాజపా, కాంగ్రెస్.

ఫుట్​బాల్​ ఆటగాడు భైచుంగ్​ భుటియా హమ్రో సిక్కిం పార్టీ స్థాపించి, ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.

సిక్కింలో తొలి విడతలోనే అన్ని స్థానాలకు ఓటింగ్​ పూర్తి కానుంది.

భారత్ ​భేరి: 'ప్రాంతీయ' కోటలు దక్కేదెవరికి?

ఈ రాష్ట్రాల్లో అధికార పీఠం ఎవరిదో మే 23న తేలనుంది.

ఇదీ చూడండి: భారత్​ భేరి: రికార్డుల కింగ్​ సిక్స్ కొడతారా

ABOUT THE AUTHOR

...view details