తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భారత్​ భేరి: ప్రజలు కాదు... 'పొత్తులే' నిర్ణేతలు!

2019 సార్వత్రిక ఎన్నికలు తుది అంకానికి చేరుకున్నాయి. ఇప్పటికే ఆరు విడతల పోలింగ్​ పూర్తయింది. మే 19న జరిగే చివరి దశతో ఎన్నికలు ముగియనున్నాయి. ఏడో విడత పోలింగ్​, తదనంతర పరిణామాలపై ఈటీవీ భారత్​ ముఖాముఖిలో మాట్లాడారు రాజకీయ విశ్లేషకులు ఎంకే సింగ్​.

సార్వత్రిక ఎన్నికల్లో రాజకీయ ముఖచిత్రం

By

Published : May 16, 2019, 5:31 AM IST

సార్వత్రిక ఎన్నికల్లో రాజకీయ ముఖచిత్రం

"2014 కాదు.... అంతకుమించిన ప్రభంజనం ఖాయం".... ఈ సార్వత్రిక ఎన్నికల్లో భాజపా విజయంపై ధీమా వ్యక్తంచేస్తూ కమలనాథులు చెబుతున్న మాట ఇది. మహాకూటమి గెలుస్తుందని విపక్ష నేతలు ఈ స్థాయిలో విశ్వాసం వ్యక్తంచేయకపోయినా... అధికారం దక్కుతుందన్న ఆశతోనే ఉన్నారు. సాధ్యమైనన్ని పార్టీలను ఏకతాటిపైకి తెచ్చి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసే ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

ఆరు దశల పోలింగ్​ ముగిసేసరికి... సార్వత్రిక ఎన్నికల ఫలితం ఎలా ఉంటుందన్న ప్రశ్నకు దాదాపు ఒకే రకమైన సమాధానం వినిపిస్తోంది.... స్పష్టమైన ఆధిక్యం ఏ పార్టీకీ రాదని. ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఎంకే సింగ్​దీ అదే మాట. ఎన్నికల అనంతరం పొత్తులే... అధికారం ఎవరిదో నిర్దేశిస్తాయని ఈటీవీ భారత్​ ముఖాముఖిలో చెప్పారు.

''2019 ఎన్నికలు 2014లా కాకుండా పూర్తి విభిన్నంగా సాగుతున్నాయి. 6 దశల పోలింగ్​ పూర్తయ్యే సరికి ఏ పార్టీకీ స్పష్టమైన మెజార్టీ వచ్చే అవకాశం లేదు. ఏడో దశకు చేరింది. తుది విడత భాజపాకు కీలక పరీక్ష. గత లోక్​సభ ఎన్నికల్లో ఎక్కువ మంది అభ్యర్థులు ఈ దశలో గెలిచారు. భాజపా అధికారంలోకి రావాలంటే ఈ స్థానాలను నిలబెట్టుకోవడం అవసరం.

మెజార్టీ రాని పక్షంలో ఎన్నికల అనంతరం పొత్తుల కోసం ప్రయత్నిస్తాయి. మిగతావాటితో పోలిస్తే భాజపా ఆధిక్యానికి చేరువగా వెళ్లే అవకాశముంది. భాగస్వామ్య పక్షాల సహకారం, ఎన్నికల అనంతరం పొత్తులతో దిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు వీలు కలుగుతుంది.''

- ఎంకే సింగ్​, రాజకీయ విశ్లేషకులు

ఎన్నికల అనంతరం మహాకూటమి పార్టీలు ఏకాభిప్రాయంతోనే ఉంటే ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం లేకపోలేదని అన్నారు ఎంకే సింగ్​.

''ఉత్తర్​ప్రదేశ్​లో ఎస్పీ-బీఎస్పీ, ఆర్​ఎల్​డీతో ఎన్నికల అనంతరం కాంగ్రెస్ కలిస్తే దేశ రాజకీయ ముఖచిత్రమే మారుతుంది. ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే అవకాశాన్ని సృష్టిస్తాయి. ఒకవేళ సంధి కుదరకపోతే.. భాజపా సర్కార్​కు మార్గం సుగమం అవుతుంది. ''

- ఎంకే సింగ్​, రాజకీయ విశ్లేషకులు

ఇదీ చూడండి: 'అప్పుడు మోదీ X సోనియా.. మరి ఇప్పుడు?'

ABOUT THE AUTHOR

...view details