రక్షణ, విపత్తులు సంభవించినప్పుడు చేసిన ప్రసంగాలు ఎన్నికల నియమావళి పరిధిలోకి రావని ఎన్నికల సంఘం అధికారి ఒకరు పేర్కొన్నారు.
'శక్తి' ప్రకటనపై పరిశీలనకు ఈసీ కమిటీ - ప్రసంగం
మిషన్ శక్తి విజయంతో జాతినుద్దేశించి ప్రసగించారు ప్రధాని నరేంద్ర మోదీ. ప్రధాని ప్రసంగం ఎన్నికల నియమావళిని ఉల్లఘించిందని, దీనిపై విచారణ చేపట్టాలని విపక్షాలు ఈసీని ఆశ్రయించాయి. స్పందించిన ఎన్నికల సంఘం... ఒక కమిటీ ఏర్పాటు చేసింది.
నరేంద్ర మోదీ
క్షిపణి విజయానుద్దేశించి ప్రధాని మోదీ చేసిన ప్రసంగం ఎన్నికల నియమావళిని ఉల్లఘించిందని ప్రతిపక్షాల ఫిర్యాదుతో కమిటీ ఏర్పాటు నిర్ణయం తీసుకుంది ఈసీ. సహాయ ఎన్నికల కమిషనర్ సందీప్ సక్సేనా ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేశారు.
ప్రధాని ప్రసంగ వీడియో చూసి, వీలైనంత త్వరగా కమిటీ నిర్ణయం వెలువరిస్తుందని ఎన్నికల సంఘం పేర్కొంది
Last Updated : Mar 28, 2019, 7:12 AM IST