తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అశోక్​ లవాసా రాజీనామాను ఆమోదించిన రాష్ట్రపతి - Election Commissioner Ashok Lavasa

కేంద్ర ఎన్నికల కమిషనర్​ అశోక్​ లవాసా.. తన రాజీనామా లేఖను మంగళవారం రాష్ట్రపతికి పంపగా... దానికి ఆమోదం తెలిపారు కోవింద్​. ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) ఉపాధ్యక్షుడిగా నియమితులైన నేపథ్యంలో ఎన్నికల సంఘం పదవికి రాజీనామా చేశారు లవాసా.

Election Commissioner Ashok Lavasa submits resignation
అశోక్​ లవాసా రాజీనామాకు రాష్ట్రపతి ఆమోదం

By

Published : Aug 19, 2020, 11:24 AM IST

కేంద్ర ఎన్నికల కమిషన్‌లో సీనియారిటీ పరంగా రెండో స్థానంలో ఉన్న అశోక్‌ లవాసా రాజీనామాకు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. ఆసియా అభివృద్ధి బ్యాంకు(ఏడీబీ) ఉపాధ్యక్షుడిగా నియమితులైన ఆయన వచ్చే నెలలో ఆ బాధ్యతలు చేపట్టడానికి సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో మంగళవారం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు తన రాజీనామాను సమర్పించారు.

ప్రస్తుతం ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా ఉన్న సునీల్‌ అరోడా వచ్చే ఏడాది ఏప్రిల్‌లో పదవీ విరమణ చేయనున్నారు. ఆయన తర్వాత ఆ బాధ్యతలు చేపట్టాల్సి ఉన్నప్పటికీ.. అశోక్​ ఆ అవకాశాన్ని వదులుకున్నారు. ఫలితంగా ప్రస్తుతం మూడో స్థానంలో ఉన్న సుశీల్‌ చంద్రకు సునీల్‌ తర్వాత ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశం దక్కింది.

ABOUT THE AUTHOR

...view details