తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కర్ణాటక శాసనసభ ఉపఎన్నికలు వాయిదా!

కర్ణాటక శాసనసభ ఉప ఎన్నికలు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది భారత ఎన్నికల సంఘం. అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేల పిటిషన్​పై ఆదేశాలు ఇచ్చే వరకు వాయిదా వేస్తామని సుప్రీం కోర్టుకు తెలిపింది.

కర్ణాటక అసెబ్లీ ఉపఎన్నికలు వాయిదా!

By

Published : Sep 26, 2019, 4:51 PM IST

Updated : Oct 2, 2019, 2:44 AM IST

కర్ణాటక అసెంబ్లీ ఉప ఎన్నికలు వాయిదాపడ్డాయి. అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేల పిటిషన్​పై ఆదేశాలు ఇచ్చే వరకు వాయిదా వేస్తామని సుప్రీం కోర్టుకు తెలిపింది ఈసీ.

కర్ణాటకలో 15 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలకు ఇటీవలే షెడ్యూల్​ విడుదల చేసింది ఈసీ. అక్టోబర్​ 21 ఓటింగ్​ జరిగి, 24న ఫలితాలు విడుదల కావాల్సి ఉంది.

ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం కల్పించాల్సిందిగా అనర్హతకు గురైన 17 మంది ఎమ్మెల్యేలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈపిటిషన్లపై జస్టిస్​ ఎన్​వీ రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. పూర్తి స్థాయిలో విచారణ జరిగిన తర్వాతే తీర్పు వెలువరిస్తామని తెలిపింది. ఈ సందర్భంగా అసెంబ్లీ ఉప ఎన్నికలు వాయిదా వేస్తామని ఈసీ తరఫు న్యాయవాది రాకేశ్​ ద్వివేదీ ధర్మాసనానికి తెలిపారు.

తీర్పు వెలువడే వరకు ఉప ఎన్నికలు వాయిదా వేస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని పేర్కొన్నారు ఎమ్మెల్యేల తరఫు న్యాయవాది.

ఇరు పక్షాల వాదనల అనంతరం తదుపరి విచారణను అక్టోబర్​ 22కు వాయిదా వేసింది ధర్మాసనం.

ఇదీ చూడండి:ఎన్​ఆర్​సీ దుమారం: కేజ్రీకి వ్యతిరేకంగా భాజపా ఆందోళన

Last Updated : Oct 2, 2019, 2:44 AM IST

ABOUT THE AUTHOR

...view details