తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఈవీఎంల తర్వాతే స్లిప్పుల లెక్క: ఈసీ - VVPAT

వీవీప్యాట్​ స్లిప్పుల లెక్కింపు విషయంలో విపక్షాలకు షాకిచ్చింది ఎన్నికల సంఘం. స్లిప్పులు తర్వాతే ఈవీఎంలలో ఓట్లు లెక్కించాలన్న విపక్షాల అభ్యర్థనను తోసిపుచ్చింది.

విపక్షాలకు ఎన్నికల సంఘం షాక్

By

Published : May 22, 2019, 1:58 PM IST

Updated : May 22, 2019, 2:52 PM IST

వీవీప్యాట్​ స్లిప్పులు లెక్కించాకే ఈవీఎంలలో ఓట్లు లెక్కపెట్టాలన్న విపక్షాల అభ్యర్థనను కేంద్ర ఎన్నికల సంఘం తోసిపుచ్చింది. మంగళవారం విపక్ష నేతలు కలిసి చేసిన విజ్ఞప్తిపై ఈమేరకు నిర్ణయం ప్రకటించింది.

ఇదీ నేపథ్యం...

విపక్షాల న్యాయపోరాటం, సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో... ప్రస్తుతం ఒక్కో శాసనసభ నియోజకవర్గం పరిధిలో 5 వీవీప్యాట్​ల స్లిప్పులు మాత్రమే లెక్కిస్తారు. అది కూడా ఈవీఎంల లెక్కింపు పూర్తయ్యాక. ఈ విధానం విపక్షాలకు ఏమాత్రం సంతృప్తికరంగా లేదు.

ముందుగా వీవీప్యాట్​లు లెక్కించాలని, తేడా వచ్చినచోట్ల 100శాతం స్లిప్పులు గణించాలన్నది విపక్షాల డిమాండ్​. ఈ మేరకు మంగళవారం ఈసీకి వినతిపత్రం సమర్పించారు విపక్ష నేతలు.

విపక్షాల అభ్యర్థనపై ఎన్నికల సంఘం నేడు చర్చించింది. ఈవీఎంలకన్నా ముందే వీవీప్యాట్​ రసీదులు లెక్కపెట్టాలన్న వినతిని తోసిపుచ్చింది.

Last Updated : May 22, 2019, 2:52 PM IST

ABOUT THE AUTHOR

...view details