ఎన్నికల నిబంధనావళి ఉల్లంఘించారన్న కారణంతో కేంద్ర మంత్రి, భాజపా నాయకురాలు మేనకా గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ నేత ఆజంఖాన్‌లపై చర్య తీసుకుంది ఈసీ. మేనకాగాంధీ 48 గంటలు, ఆజంఖాన్ 72 గంటలపాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా ఎన్నికల సంఘం నిషేధం విధించింది. మంగళవారం 10 గంటలనుంచి వీరిద్దరిపై తమ ఆదేశాలు అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది.
సుల్తాన్‌పుర్ ఎన్నికల ప్రచారంలో మతాలకు సంబంధించిన వ్యాఖ్యలు చేశారంటూ మేనకా గాంధీపై ఆరోపణలొచ్చాయి. రాంపుర్ ఎన్నికల ప్రచారంలో భాజపా అభ్యర్థి, నటి జయప్రదపై.. ఎస్పీ నేత ఆజంఖాన్ అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఈసీకి ఫిర్యాదులందాయి.