జాతకాలు చెప్పేవారు, టారోట్ రీడర్లు (బొమ్మలతో కూడిన కార్డులతో జోస్యం చెప్పేవారు), రాజకీయ విశ్లేషకులు లేదా మరెవరైనా ఎన్నికల ఫలితాలపై చేసే ఎలాంటి ముందస్తు అంచనాలను మీడియాలో వెల్లడించరాదని ఎన్నికల సంఘం (ఈసీ) గురువారం స్పష్టం చేసింది.
బిహార్ ఎన్నికల్లో జోస్యాలపైనా ఈసీ నిషేధం
బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధంలో భాగంగా మరో కీలక నిర్ణయం తీసుకుంది ఎన్నికల సంఘం. జాతకాలు చెప్పేవారు, టారోట్ రీడర్లు(బొమ్మలతో కూడిన కార్టులతో జోస్యం చెప్పేవారు), రాజకీయ విశ్లేషకులు వంటి వారు ఫలితాలపై చేసే ముందస్తు అంచనాలను మీడియాలో వెల్లడించరాదని స్పష్టం చేసింది.
బిహార్ అసెంబ్లీ ఎన్నికలు
బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి.. ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధంలో భాగంగా ఈమేరకు ఎడ్వైజరీని విడుదల చేసింది. ఎలక్ట్రానిక్, పత్రికా మాధ్యమాలేవీ ఇలాంటివాటిని ఏవిధంగానూ ప్రసారం చేయడం, ప్రచురించడం చేయరాదని స్పష్టం చేసింది. బిహార్ ఎన్నికలు స్వేచ్ఛగా, సాఫీగా జరిగేందుకు గాను ఈ నిషేధం అక్టోబరు 28 ఉదయం 7 గంటల నుంచి నవంబరు 7 సాయంత్రం 6.30 వరకు అమల్లో ఉంటుందని పేర్కొంది.
ఇదీ చూడండి: 'బిహార్ తొలి దశ పోలింగ్‌కు 1,090 నామపత్రాల చెల్లుబాటు'