తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భారత్​ భేరి: మూడో విడత ప్రచారానికి తెర - maharastra

ఏప్రిల్​ 23న జరగనున్న మూడో విడత లోక్​సభ ఎన్నికలకు సంబంధించి ప్రచారానికి తెరపడింది. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించటానికి విస్తృత ఏర్పాటు చేస్తోంది ఎన్నికల సంఘం.

భారత్​ భేరి: మూడో విడత ప్రచారానికి తెర

By

Published : Apr 21, 2019, 5:11 PM IST

Updated : Apr 21, 2019, 7:23 PM IST

భారత్​ భేరి: మూడో విడత ప్రచారానికి తెర

సార్వత్రిక ఎన్నికల మూడో విడతకు సంబంధించి హోరాహోరీగా జరిగిన ప్రచారానికి తెరపడింది. ఏప్రిల్​ 23న మొత్తం 15 రాష్ట్రాల్లో 116 నియోజకవర్గాలకు పోలింగ్​ జరగనుంది. రెండో విడతలో ఎన్నికలు జరగకుండా వాయిదా పడ్డ త్రిపురలోని స్థానం కూడా ఇందులో ఉంది.

ముమ్మర ఏర్పాట్లు..

పోలింగ్​ ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. గత విడతలో పశ్చిమబంగాలో జరిగిన హింసాత్మక ఘటనల దృష్ట్యా భారీగా బలగాలను మోహరిస్తోంది.

రేపు రాత్రికల్లా ఈవీఎంలతో పాటు అధికారులు పోలింగ్​ కేంద్రాలకు చేరుకుంటారు.

దక్షిణ భారతంలో పోలింగ్​ పూర్తి...

కేరళలోని 20 స్థానాలకు ఈ దశలోనే పోలింగ్​ పూర్తికానుంది. కర్ణాటకలో మిగిలి ఉన్న 14 స్థానాలకు ఎన్నిక జరగనుంది. తమిళనాడులో ఎన్నిక రద్దయిన వెల్లూరు స్థానం మినహాయిస్తే... దక్షిణ భారతం మొత్తానికి ఈ విడతతో పోలింగ్​ పూర్తి కానుంది.

కర్ణాటకలో ప్రధానపోటీ కాంగ్రెస్​-జేడీఎస్​ కూటమికి, భారతీయ జనతా పార్టీకి ఉండనుంది. మండ్యలో అంబరీష్​ భార్య, సినీ నటి సుమలత.... ముఖ్యమంత్రి కుమార స్వామి కుమారుడు నిఖిల్​ గౌడ మధ్య పోరుపై ఉత్కంఠ నెలకొంది.

గుజరాత్​లో పోటాపోటీ...

మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్​లోని మొత్తం 26 సీట్లకు ఈ విడతలోనే పోలింగ్​ పూర్తి కానుంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న భాజపాకు కాంగ్రెస్​ గట్టిపోటీ ఇస్తోంది. గోవా, ఛత్తీస్​గఢ్​లో ప్రధాన పోటీ ఈ 2 పార్టీల మధ్యే ఉండనుంది.

ప్రాంతీయ కోటల్లో జెండా ఎగరవేయాలని..

ఒడిశాలో 6 లోక్​సభ స్థానాలు, వాటి పరిధిలోని అసెంబ్లీ స్థానాలకు ఈ దశలో పోలింగ్​ జరగనుంది. ఇక్కడ నవీన్​ పట్నాయక్​ సారథ్యంలోని బిజూ జనతా దళ్​ 2000 సంవత్సరం నుంచి అధికారంలో ఉంది. ఈ సారి ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని భాజపా ఆశిస్తోంది.

పశ్చిమ బంగాలో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్​ కాంగ్రెస్​తో భాజపా ఢీ కొడుతోంది. ఈశాన్య రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీ అయిన అసోం గణ పరిషత్​కు భాజపాకు మధ్య పోటీ ఉంది.

Last Updated : Apr 21, 2019, 7:23 PM IST

ABOUT THE AUTHOR

...view details