రూ.5 ఫ్యాక్షన్ కథతో త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన సినిమా చూసే ఉంటాం. అదే రూ.5 కోసం గ్యాస్ స్టేషన్ ఉద్యోగులు ఒకతన్ని కొట్టి చంపారు. ముంబయిలోని బోరివలీలో ఈ ఘటన జరిగింది.
కథేంటంటే..
రూ.5 ఫ్యాక్షన్ కథతో త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన సినిమా చూసే ఉంటాం. అదే రూ.5 కోసం గ్యాస్ స్టేషన్ ఉద్యోగులు ఒకతన్ని కొట్టి చంపారు. ముంబయిలోని బోరివలీలో ఈ ఘటన జరిగింది.
కథేంటంటే..
రామ్దులర్ సర్జు యాదవ్ (68) తన ఆటోకు గ్యాస్‌ను కొట్టించేందుకు ఓ స్టేషన్‌కు వెళ్లాడు. గ్యాస్‌కు రూ.205 ఖర్చవగా.. యాదవ్ రూ.500 ఇచ్చి చిల్లర అడిగాడు. అయితే అక్కడ పని చేసే ఉద్యోగి తిరిగి ఇవ్వాల్సిన రూ.295ల్లో 5 రూపాయలు తక్కువ ఇచ్చాడు. తనకు రావాల్సిన డబ్బులు ఇవ్వాలని అడగ్గా.. యాదవ్‌పై ఆ ఉద్యోగి దుర్భాషలాడాడు. అలా ఇరువురి మధ్య వాగ్వివాదం చెలరేగింది. ఇంతలో జోక్యం చేసుకున్న సహోద్యోగులు.. యాదవ్‌ను కొట్టగా స్పృహ తప్పి పడిపోయాడు. ఆసుపత్రికి తరలించగా.. మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయాడు.
ఈ ఘటనకు పాల్పడిన ఐదుగురు గ్యాస్ స్టేషన్ ఉద్యోగులను అరెస్టు చేసి సెక్షన్ 302 కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు పోలీసులు.