ఉత్తరాఖండ్లో అనూహ్య ఘటన ఆసల్యంగా వెలుగులోకి వచ్చింది. సుమారు ఆర్నెల్ల పాటు గదిలో బందీ అయిన ఓ వృద్ధ జంటను గుర్తించారు పోలీసులు. నెలలపాటు నీరు, ఆహారంలేని ఆ దంపతులు బక్కచిక్కిపోయారు. తీవ్ర అనారోగ్యం బారినపడిన వారిని.. చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థతి విషమంగా ఉన్నట్టు సమాచారం.
అసలేం జరిగిందంటే.?
మాజీ సైనిక ఉద్యోగి జమాన్ సింగ్ నేగి(60), భార్య దేవకీ దేవితో కలిసి బాగేశ్వర్ జిల్లాలో నివాసముంటున్నారు. ఇద్దరూ ఇంట్లో ఉన్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి.. గదికి తాళం వేసి వెళ్లారు. చేసేదేమీ లేక.. ఆ వృద్ధులిద్దరూ సుమారు ఆరు నెలల పాటు అందులోనే ఉండిపోయారు.