బహిరంగ ప్రదేశంలో మద్యం తాగొద్దని చెప్పినందుకు వృద్ధ దంపతులపై దాడి చేశారు దుండగులు. తీవ్రంగా కొట్టటం వల్ల ఆ దంపతులు ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఝార్ఖండ్ గుమ్లా జిల్లాలో జరిగింది.
జిల్లాలోని సత్పారా ఖట్టా గ్రామంలో ఆదివారం సాయంత్రం కొందరు బహిరంగ ప్రదేశంలో మద్యం తాగాారు. అది తప్పని చెప్పగా సైనీ గోప్ (70), ఫులో దేవి (65)తో గొడవకు దిగారు. వృద్ధులని కూడా చూడకుండా వారిని విచక్షణ రహింతగా కొట్టారు. ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే వారు ప్రాణాలు కోల్పోయారు.