తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భారత్​ భేరి: రాజకీయ వినోదం @​ ట్విట్టర్​ - bjp

'మై బీ చౌకీదార్​'....! 'చౌకీదార్​ చోర్​ హై'...! సార్వత్రిక ఎన్నికల వేళ రాజకీయం అంతా చౌకీదార్​ చుట్టూనే. నేతల ప్రసంగాలన్నీ కాపలాదారుల మయమే. ఇప్పుడు మరో అడుగు వేశాయి భాజపా, కాంగ్రెస్. వ్యంగ్యమైన ట్వీట్లతో పరస్పరం దాడి చేసుకుంటూ నెటిజన్లకు వినోదం పంచుతున్నాయి.

రాజకీయ వినోదం @​ ట్విట్టర్​

By

Published : Apr 1, 2019, 6:49 PM IST

Updated : Apr 1, 2019, 7:06 PM IST

"ఇక్కడ 6 ఆవులు ఉన్నాయి. వాటిలో ఒకటి మాత్రం భిన్నం. అదేమిటో గుర్తించండి."

"చింటూ ఆడుకుంటూ తప్పిపోయాడు. అతడు ఇంటికి వెళ్లేందుకు దారి చూపండి."

ఈనాడు ఆదివారం పుస్తకంలో కనిపించే సరదా ఆటలివి. ఇప్పుడు ఇలాంటి ఆటలు ప్రముఖ రాజకీయ పార్టీల సామాజిక మాధ్యమాల ఖాతాల్లోనూ కనిపిస్తున్నాయి.

విమర్శలతో ఆటలు...

'చౌకీదార్​'... ప్రస్తుత రాజకీయాల్లో ఇదే ట్రెండింగ్. దేశాన్ని రక్షించేది మేమే అంటూ 'మై బీ చౌకీదార్​' నినాదంతో ప్రచారం సాగిస్తోంది భాజపా. ఇందుకు ప్రతిగా 'చౌకీదార్​ చోర్​ హై' అంటోంది కాంగ్రెస్​.

రఫేల్​ వ్యవహారంతో 'చౌకీదార్​ చోర్​ హై' అని విమర్శించడం మొదలుపెట్టింది కాంగ్రెస్. ఇప్పుడు ట్విట్టర్​ వేదికగా ఆ విమర్శలకు మరింత పదును పెట్టింది. మోదీని లక్ష్యంగా చేసుకుని... వ్యంగ్యాస్త్రాలు సంధిస్తోంది. వినోదం పాళ్లు కాస్త ఎక్కువగా ఉన్న ఈ ట్వీట్లకు నెటిజన్ల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది.

గుర్తుపట్టండి చూద్దాం...

112 మంది చౌకీదార్​ల క్యారికేచర్​లతో ఓ ఫొటో పోస్ట్ చేసింది కాంగ్రెస్. అందులో ఒక చౌకీదార్​ దొంగ ఉన్నాడు, వెతకండి అని నెటిజన్లను కోరింది. పరిశీలనగా చూస్తే... ఒక క్యారికేచర్​ మోదీని పోలి ఉంది. #EkHiChowkidarChorHai హ్యాష్​టాగ్​తో కాంగ్రెస్​ చేసిన ఈ ట్వీట్​ను కాంగ్రెస్​ అభిమానులు పెద్ద ఎత్తున షేర్​ చేశారు.

పట్టుకోండి చూద్దాం...

కాంగ్రెస్​ పార్టీ మరో 7 సెకండ్ల వీడియో ట్వీట్​ చేసింది. అందులో ఒక సాధారణ చౌకీదార్​తో పాటు దొంగ వేషంలో ఉన్న చౌకీదార్​ క్యారికేచర్ వెంట వెంటనే వేగంగా వెళ్తున్నట్లు పెట్టింది. "పట్టుకోండి..పట్టుకోండి.. దొంగను పట్టుకోండి" అని పోస్టు చేసింది.

దోపిడీకి దారి చూపే చౌకీదారే దొంగ అంటూ మరో వ్యంగ్య చిత్రం పోస్ట్ చేసింది కాంగ్రెస్.

కమలదళం ఎదురుదాడి...

విపక్ష నేతలు వేర్వేరు సందర్భాల్లో ప్రధానిని ఉద్దేశించి అన్న మాటల్ని గుర్తుచేస్తూ ఓ వీడియో రూపొందించింది భాజపా. దేశం కోసం నిజాయితీగా పనిచేసే వ్యక్తిని దూషిస్తే ప్రజలు క్షమించరంటూ మండిపడింది.

కాంగ్రెస్​పై విమర్శల దాడికన్నా... ఐదేళ్ల పాలనలో చేసిన పనులను చెప్పుకునేందుకు అధిక ప్రాధాన్యం ఇస్తోంది భాజపా. నవభారత నిర్మాణానికి మేం చేసిందిదే అంటూ రూపొందించిన వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

ఇవీ చూడండి:
భారత్​ భేరి: 5% ఓట్లు ఫేస్​బుక్​, ట్విట్టర్​వే!

Last Updated : Apr 1, 2019, 7:06 PM IST

ABOUT THE AUTHOR

...view details