అత్యాధునిక మిలిటరీ సామగ్రి తయారు చేయడానికి రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) ఎనిమిది ఉన్నతస్థాయి పరిశోధన కేంద్రాలను ఏర్పాటు చేసింది. రాజ్యసభలో రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ నాయక్ ఈ విషయాన్ని ప్రకటించారు. డీఆర్డీఓకు దేశవ్యాప్తంగా 50 ప్రయోగశాలలు ఉన్నాయని అన్నారు.
డీఆర్డీఓ ఆధ్వర్యంలో 8 పరిశోధన కేంద్రాలు - పార్లమెంటు సమావేశాలు 2020
అత్యాధునిక సైనిక పరికరాల ఉత్పత్తికి 8 ఉన్నతస్థాయి పరిశోధన కేంద్రాలను డీఆర్డీఓ ఏర్పాటు చేసిందని కేంద్రం ప్రకటించింది. దేశవ్యాప్తంగా డీఆర్డీఓకు 50 ప్రయోగశాలలు ఉన్నాయని రక్షణ శాఖ సహాయమంత్రి రాజ్యసభలో వెల్లడించారు.
డీఆర్డీఓ
వీటి సామర్థ్యాన్ని పెంచే విషయమై సలహాలు ఇచ్చేందుకు ఐఐటీ- దిల్లీ డైరెక్టర్ ప్రొఫెసర్ వి.రామగోపాలరావు ఆధ్వర్యంలో కమిటీ వేసినట్లు తెలిపారు. మరో ప్రశ్నకు సమాధానం చెబుతూ ఆయుధాలను తయారు చేస్తోన్న ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డును కార్పొరేట్ సంస్థగా మార్చనున్నట్లు తెలిపారు.
ఇదీ చూడండి:మిలటరీ క్యాంటీన్లో 'మేడ్ ఇన్ ఇండియా' అమలవుతోందా..?