కర్ణాటక మండ్య జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. మద్దూరు తాలుకాలోని కొక్కరె బెల్లూర్ గ్రామంలో.. ఆస్తి కోసం శ్రీనివాస్, మరంకయ్యల కుటుంబాలు ఘర్షణకు దిగాయి. వివాదం అనంతరం.. ఇరు కుటుంబాలకు చెందిన 8మంది విషం తాగారు. ఈ ఘటనలో శైలా(35) అనే వ్యక్తి మరణించగా.. మిగతా వారిని మండ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(మిమ్స్)కు తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
రెండు కుటుంబాల్లో 'ఆస్తి' చిచ్చు- విషం తాగిన 8మంది - రెండు కుటుంబాల్లో ఒకేసారి 8 మంది విష ప్రయోగం.. ఎందుకంటే?
ఆస్తి పంపకాల విషయంలో కర్ణాటకలోని రెండు కుటుంబాలు ఘర్షణకు దిగాయి. అనంతరం ఇరు కుటుంబాలకు చెందిన 8మంది విషం తాగారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మిగతావారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఆ రాష్ట్రంలో 8 మంది విషం తాగారు.. ఎందుకంటే?
ఈ పూర్తి వ్యవహారంపై కేసు నమోదు చేసుకున్న మద్దూర్ పోలీస్ స్టేషన్ అధికారులు.. సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి:'నేను సంతోషంగా లేను.. అందుకే చంపేస్తున్నా'