ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బెమెత్రా జిల్లా మోహ్భత్తా సమీపంలో ఓ కారు ప్రమాదవశాత్తు అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో నలుగురు మహిళలు, ఒక బాలుడు ఉన్నారు. బెమెత్రా నుంచి మోహ్భత్తా వెళ్తున్న క్రమంలో ప్రమాదం జరిగింది.
చెరువులోకి దూసుకెళ్లిన కారు.. 8 మంది మృతి
ఛత్తీస్గఢ్ బెమెత్రా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు ప్రమాదవశాత్తు అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లిన దుర్ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు.
చెరువులోకి దూసుకెళ్లిన కారు.. 8 మంది మృతి
ఘటనాస్థలానికి చెరుకున్న పోలీసులు, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. మృతులు బెమెత్రా జిల్లా నదల్ గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు.
ఇదీ చూడండి: రాజ్యసభ సెలక్ట్ కమిటీ పరిశీలనకు సరోగసీ బిల్లు
Last Updated : Nov 21, 2019, 11:35 PM IST