తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కశ్మీర్​లో 'ఈద్' ప్రశాంతం... కానీ​ కళ తప్పింది!

బక్రీద్​ పర్వదినం పురస్కరించుకుని నిర్వహించే ప్రత్యేక​ ప్రార్థనలు కశ్మీర్​ లోయలో ప్రశాంతంగా ముగిశాయి. కానీ భారీగా మోహరించిన బలగాలతో పండుగ వాతావరణం కనిపించలేదు. ప్రార్థనలు స్థానిక మసీదులకే పరిమితమయ్యాయి. ఏటా నాయకుల ఇళ్లల్లో ఉండే కోలాహలం ఈసారి కనిపించలేదు.

కశ్మీర్​లో 'ఈద్' ప్రశాంతం... కానీ​ కళ తప్పింది!

By

Published : Aug 12, 2019, 5:44 PM IST

Updated : Sep 26, 2019, 6:47 PM IST

కశ్మీర్​లో 'ఈద్' ప్రశాంతం... కానీ​ కళ తప్పింది!

అసాధారణ భద్రత నేపథ్యంలో కశ్మీర్​ లోయలో బక్రీద్​ వాతావరణం కనిపించలేదు. ఈద్​ ఉల్​ అదా ప్రార్థనలు స్థానిక మసీదులకే పరిమితమయ్యాయి. మైదానాల్లో భారీ స్థాయిలో నిర్వహించే కార్యక్రమాలను నిషేధించారు అధికారులు. ఈద్గా, టీఆర్​సీ మైదానాలు, హజ్రత్​బల్​ పుణ్యక్షేత్రం, సయ్యద్​ సాహెబ్​ మసీద్​ వద్ద ఈద్​ వేడుకలు జరగలేదు. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. పోలీసు వాహనాల సైరన్​, వైమానిక దళ హెలికాప్టర్ల శబ్దాలు మాత్రమే వినిపించాయి.

మూడు ప్రాంతాల్లో స్వల్ప ఆందోళనలు మినహా కశ్మీర్​వ్యాప్తంగా ప్రశాంతంగా ప్రార్థనలు ముగిసినట్లు పోలీసులు తెలిపారు.

నాయకులు ఒంటరిగానే..

జమ్ముకశ్మీర్​ మాజీ ముఖ్యమంత్రులు ఫరూక్​, ఒమర్​ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీతో పాటు పలువురు నాయకులకు ఈ ఏడాది బక్రీద్​ ఒంటరిగానే చేసుకోవాల్సి వచ్చింది. వారి ఇళ్లల్లో ఏటా ఉండే సందడి ఈసారి కనిపించలేదు. అధికరణ 370 రద్దు నేపథ్యంలో వీరిని పోలీసులు అదుపులోకి తీసుకోవడమే ఇందుకు కారణం.

మదద్​గార్​ హెల్ప్​లైన్​ అందుబాటులోకి...

శ్రీనగర్​లోని సీఆర్​పీఎఫ్​ హెల్ప్​లైన్​ 'మదద్​గార్​' 14411ను ప్రజల సౌకర్యార్థం తిరిగి అందుబాటులోకి తీసుకొచ్చారు అధికారులు. కశ్మీర్​ ప్రజలు... ఇతర ప్రదేశాల్లో ఉన్న తమవారితో మాట్లాడేందుకు, సమస్యలను తెలిపేందుకు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చని సూచించారు.

ఇదీ చూడండి:'వరద ప్రభావం': దర్జాగా ఇల్లెక్కిన మొసలి!

Last Updated : Sep 26, 2019, 6:47 PM IST

ABOUT THE AUTHOR

...view details