కొత్త కరోనా వైరస్ బ్రిటన్ను వణికిస్తోన్న నేపథ్యంలో ఆ దేశం నుంచి వచ్చిన వారికోసం గాలిస్తున్నట్లు గోవా వైద్యాధికారులు పేర్కొన్నారు. డిసెంబర్ 9 నుంచి దాదాపు 602 మంది బ్రిటన్, అరబ్ దేశాల నుంచి తమ ప్రాంతానికి వచ్చినట్లు తెలిపారు.
ఈ రెండు దేశాల నుంచి వచ్చిన వారిలో ఎక్కువ మంది దక్షిణ గోవా జిల్లాలో ఉన్నట్లు ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. 91 మంది కన్సాలియమ్లో, 57 మంది కోర్టాలియమ్లో ఉన్నట్లు గుర్తించారు. మరో 48 మంది ఉత్తర గోవాలో, 47 మంది చింబెల్లో ఉన్నట్లు తెలిపారు. గోవా రాజధాని పనాజీలో ఉన్న 28 మంది కోసం గాలింపు చేస్తున్నట్లు పేర్కొన్నారు.