కర్ణాటక కోలార్ జిల్లాలోని శ్రీనివాసపురాకి చెందిన గ్రామస్థులను ఆకాశమార్గంలో కొంతసేపు తిప్పాయి ప్రముఖ ఏవియేషన్ సంస్థలైన ఈడీఎస్ ఏవియేషన్ అకాడమీ, డెక్కన్ ఛార్టర్లు. శబ్దం రాగానే తల పైకెత్తి ఆకాశం వైపు చూసే వారిని కొత్తగా నింగిలోకి తీసుకుపోవడంతో వారి ఆనందం మిన్నంటింది.
హెలికాఫ్టర్‌లో గ్రామస్థుల చక్కర్లు - helicopter joy rides in Karnataka
ఆకాశంలో వెళ్లే విమానాన్నో, హెలికాఫ్టర్నో చూసినప్పుడు మనమెప్పుడు ఎక్కుతాం అని అనుకుంటూ ఉంటాం. మనలో కొందరు ఆ అనుభూతిని పొందుతారు. మరికొందరికి కల లానే మిగిలిపోతుంది. అలాంటి వారి కలను నిజం చేశాయి ప్రముఖ ఏవియేషన్ సంస్థలు.
![హెలికాఫ్టర్‌లో గ్రామస్థుల చక్కర్లు EDS Aviation and Deccan Charters organise helicopter rides for villagers](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9392425-687-9392425-1604236305313.jpg)
గ్రామస్థుల హెలికాఫ్టర్ ప్రయాణం
హెలికాఫ్టర్‌లో గ్రామస్థుల చక్కర్లు
పెద్ద పెద్ద వీవీఐపీలు మాత్రమే తిరిగే ఈ హెలికాప్టర్లో సామాన్యులకు చోటు దక్కడం పట్ల వారు సంతోషం వ్యక్తం చేశారు. ఈ 15 నిమిషాల జాయ్ రైడ్‌కు ఆ సంస్థలు కేవలం రూ.4,500 వసూలు చేయడం గమనార్హం. అయితే ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చేముందు తగు జాగ్రత్తలు కూడా తీసుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు.