తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఏజేఎల్​' ప్లాట్​ స్వాధీనానికి ఈడీ సమాయత్తం - భూపేంద్రసింగ్ హుడా

దిల్లీ పంచకులలో అసోసియేటెడ్​ జర్నల్స్ లిమిటెడ్​కు కేటాయించిన కోట్ల విలువైన స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ఈడీ సమాయత్తమవుతోంది. అక్రమనగదు చలామణి ద్వారా ఏజేఎల్ ఈ స్థలాన్ని పొందినట్లు ఈడీ కేసు నమోదు చేసింది.

'ఏజీఎల్​' ప్లాట్​ స్వాధీనానికి ఈడీ సమాయత్తం

By

Published : May 29, 2019, 3:20 PM IST

Updated : May 29, 2019, 3:34 PM IST

దిల్లీ పంచకులలో 'అసోసియేటెడ్​ జర్నల్స్ లిమిటెడ్​' (ఏజేఎల్​) ఆధీనంలోని రూ.64.93 కోట్ల విలువైన స్థలాన్ని త్వరలోనే స్వాధీనం చేసుకోవడానికి ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్​ సమాయత్తమవుతోంది.

2005లో హరియాణా ప్రభుత్వం 64.93 కోట్ల విలువైన ఈ స్థలాన్ని, అతి తక్కువ ధర రూ.64.93 లక్షలకే ఏజీఎల్​కు కేటాయించింది. అందుకే గతేడాది డిసెంబర్ 1న మనీలాండరింగ్ చట్టం ప్రకారం ఈడీ ఈ ప్లాట్​ను ఎటాచ్​ చేసింది.​ అలాగే పీఎమ్​ఎల్​ఏ చట్టాన్ని ప్రయోగించింది.

ఇదే రోజున హరియాణా మాజీ ముఖ్యమంత్రి భూపేంద్రసింగ్​ హూడాతో పాటు కాంగ్రెస్ నేత మోతీలాల్ వోరాపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) కేసు నమోదు చేసింది. హూడా అక్రమ నగదు లావాదేవీలకు పాల్పడి ఏజేఎల్​కు పంచకులలోని ఈ విలువైన స్థలాన్ని కేటాయించినట్లు అభియోగాలు నమోదు చేయడం గమనార్హం.

ఏజీఎల్... గాంధీలదే..

నిజానికి ఏజేఎల్​ కాంగ్రెస్​ అగ్రనేత కనుసన్నల్లో పనిచేస్తుంది. ముఖ్యంగా గాంధీ కుటుంబం ఆధ్వర్యంలో ఇది నడుస్తోంది. ఈ ఏజేఎల్ గ్రూప్​ నేషనల్ హెరాల్డ్ పత్రికను నడుపుతోంది.

ఈడీ స్వాధీనం చేసుకుంటే..

పంచకులలోని ఈ విలువైన స్థలాన్ని ఈడీ స్వాధీనం చేసుకున్న తర్వాత మరెవరూ అక్కడ ఎలాంటి కార్యకలాపాలు కొనసాగించలేరు. ఈ కేసులో ఈడీకి అనుకూలంగా తీర్పు వెలువడితే, కోట్ల విలువైన ఈ స్థలం మరలా ప్రభుత్వ ఆధీనంలోకి వస్తుంది.

మాజీ హరియాణా ముఖ్యమంత్రి హూడా అవినీతికి పాల్పడ్డారని ఈడీ ఆరోపణలు చేసింది.

భూపేంద్రసింగ్ హూడా ముఖ్యమంత్రి పదవిని దుర్వినియోగం చేశారు. మోసపూరితంగా ఏజేఎల్​ సంస్థకు తక్కువ రేట్లకే కోట్ల విలువైన పంచకులలోని స్థలాన్ని కేటాయించారు. 1982 నాటి రేట్లు చదరపు మీటరకు రూ.91 చొప్పున ఉన్నాయి. అయితే ఏజేఎల్ బకాయిలు చెల్లించాల్సిఉన్నా కూడా, హూడా ఆ స్థలాన్ని ఏజేఎల్​కు కేటాయించేలా (2005లో) నిర్ణయం తీసుకున్నారు. ఇది చట్టవ్యతిరేకమని ఈడీ ఆరోపిస్తోంది.

ఇదీ విషయం..

1982లో ఏజేఎల్​కు హిందీ పత్రిక 'నవజీవన్​' నడపడానికి పంచకులలోని స్థలాన్ని కేటాయించారు. అయితే 1992 వరకు అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదు. ఫలితంగా హరియాణా పట్టణాభివృద్ధి సంస్థ (హెచ్​యూడీఏ) ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకుంది.

హరియాణా బీజేపీ నాయకుల విజ్ఞప్తితో... సీబీఐ ఎఫ్​ఐఆర్ ఆధారంగా... 2016లో ఈడీ కూడా పీఎమ్​ఎల్​ఏ చట్టం కింద కేసు నమోదు చేసింది.

ఇదీ చూడండి: ముజఫర్​నగర్​ అల్లర్ల కేసులో అందరూ నిర్దోషులే!

Last Updated : May 29, 2019, 3:34 PM IST

ABOUT THE AUTHOR

...view details