నీరవ్ మోదీకి చెందిన ఈ పెయింటింగ్‌లు దాదాపు రూ. 57 కోట్ల 72 లక్షల విలువ చేస్తాయి. వీటితో పాటు రోల్స్ రాయిస్, మెర్సిడెజ్, పోర్చే, టొయోటో ఫార్చునర్ వంటి 11 విలాసవంతమైన కార్లను ఈ నెలలోనే వేలం వేయనున్నట్లు ఈడీ అధికారులు తెలిపారు. మరో 68 పెయింటింగ్‌లను సైతం అమ్మకానికి పెట్టేలా ఆదాయ పన్ను శాఖకు న్యాయస్థానం అనుమతించింది.
'పీఎన్బీ' నిందితుడు నీరవ్‌మోదీ పెయింటింగ్స్ వేలం - నీరవ్ భార్య అమీ
వజ్రాల వ్యాపారి, పీఎన్బీ కుంభకోణం నిందితుడు నీరవ్‌మోదీకి చెందిన 173 పెయింటింగ్స్, 11 ఖరీదైన వాహనాలను ఈడీ వేలం వేయనుంది. మరోవైపు నీరవ్ భార్య అమీపై ముంబయి ప్రత్యేక న్యాయస్థానం నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.
'పీఎన్బీ' నిందితుడు నీరవ్‌మోదీ పెయింటింగ్స్ వేలం
భారత ఈడీ అభ్యర్థన మేరకు లండన్ కోర్టు నీరవ్‌మోదీపై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. దీంతో బుధవారం లండన్‌లోని స్కాట్లాండ్ యార్డ్‌లో నీరవ్‌ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఫలితంగా, అతన్ని భారత్‌కు రప్పించేందుకు మార్గం సుగమమైంది.
Last Updated : Mar 21, 2019, 6:21 AM IST