తెలంగాణ

telangana

ETV Bharat / bharat

డీకే శివకుమార్​కు 13 వరకు ఈడీ కస్టడీ

కర్ణాటక మాజీ మంత్రి డీకే శివకుమార్​ను ఈనెల 13వరకు ఈడీ కస్టడీకి అప్పగించింది దిల్లీ కోర్టు. దర్యాప్తు సమయంలో సహకరించలేదని, కేసును పురోగతి కోసం నిర్బంధ విచారణ అవసరమన్న ఎన్​ఫోర్స్​మెంట్​ డైరక్టరేట్​ వాదనల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది.

By

Published : Sep 4, 2019, 5:34 PM IST

Updated : Sep 29, 2019, 10:39 AM IST

డీకే శివకుమార్

మనీలాండరింగ్​ కేసులో అరెస్టయిన కర్ణాటక మాజీ మంత్రి, కాంగ్రెస్​ నేత డీకే శివకుమార్​ను ఈనెల 13 వరకు ఈడీ కస్టడీకి అప్పగించింది దిల్లీలోని రౌస్​ ఎవెన్యూ కోర్టు. కేసులో సమగ్ర దర్యాప్తు కోసం నిర్బంధ విచారణకు అనుమతించాలన్న ఎన్​ఫోర్స్​మెంట్​ డైరక్టరేట్​ విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకుంది.

వాడీవేడి వాదనలు...

కస్టడీపై నిర్ణయం తీసుకోవడానికి ముందు న్యాయస్థానంలో వాడీవేడి వాదనలు సాగాయి.

"ఆదాయపు పన్ను శాఖ విచారణ, సాక్షుల వాంగ్మూలం ప్రకారం శివకుమార్​కు వ్యతిరేకంగా ఆధారాలు ఉన్నాయి. ఈడీ విచారణలో ఆయన సహకరించలేదు. సోదాల్లో దొరికిన సొమ్ముపై ఆయన నుంచి స్పందన లేదు. శివకుమార్​ కీలకమైన పదవిలో ఉండగా ఆయన ఆస్తి భారీగా పెరిగింది. అక్రమ ఆస్తులు, పత్రాలకు సంబంధించి విచారణ చేయాల్సి ఉంది. అందుకు నిర్బంధ విచారణ అత్యవసరం. లేదా దర్యాప్తు తప్పుదారి పట్టే అవకాశం ఉంది. "
-ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​

ఈడీ కస్టడీ కోరటంపై శివకుమార్​ తరఫు న్యాయవాది అభిషేక్​ మను సింఘ్వీ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పటికే 33 గంటలపాటు ప్రశ్నించారని తెలిపారు. ఈడీ సరైన ఆధారాలు చూపే వరకు కస్టడీకి అనుమతించవద్దవని సింఘ్వీ కోరారు. శివకుమార్​ తరఫున బెయిల్​ పిటిషన్​ వేశారు.

కర్ణాటకలో బంద్

శివకుమార్​ అరెస్టును వ్యతిరేకిస్తూ నేడు కర్ణాటకవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టింది కాంగ్రెస్​. కొన్నిచోట్ల ప్రభుత్వ వాహనాలపై రాళ్లు రువ్వి, బస్సులకు నిప్పంటించారు ఆందోళనకారులు.

Last Updated : Sep 29, 2019, 10:39 AM IST

ABOUT THE AUTHOR

...view details