ముంబయి నకిలీ టీఆర్పీ కుంభకోణంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగింది. పోలీసుల ఎఫ్ఐఆర్తో సమానమైన కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఈసీఐఆర్)ను మనీలాండరింగ్ చట్టం కింద దాఖలు చేసింది. ఈ మేరకు అధికార వర్గాలు తెలిపాయి.
ముంబయి పోలీసులు అక్టోబర్లో నమోదు చేసిన ఎఫ్ఐఆర్ పరిశీలించిన తర్వాత ఈడీ కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. అయితే, కొత్త కేసు లేదా ఈసీఐఆర్ ఆధారంగా ఈడీ విచారణ చేపట్టే అవకాశం ఉందని సమాచారం.
ఇప్పటివరకు 12 మంది అరెస్టు..
టీఆర్పీ కుంభకోణంలో రిపబ్లిక్ టీవీ డిస్ట్రిబ్యూషన్ హెడ్ ఘనశ్యామ్ సింగ్ను ముంబయి క్రైం బ్రాంచ్ పోలీసులు నవంబర్ 10న అరెస్టు చేశారు. ఈ కేసును విచారిస్తున్న క్రైమ్ ఇంటెలిజెన్స్ యూనిట్ (సీఐయూ) ఇప్పటివరకు 12 మందిని అదుపులోకి తీసుకొని విచారిస్తోంది.
టీఆర్‌పీల విషయంలో కొన్ని ఛానళ్లు మోసాలకు పాల్పడుతున్నాయని బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్(బార్క్) ఇప్పటికే పలు మీడియా సంస్థలపై కేసులు నమోదు చేసింది. కొంతమందికి డబ్బులు ఇచ్చి.. తమ ఛానళ్లు చూసేలా చేస్తున్నాయని ఆరోపణలు ఉన్నాయి.
ఇదీ చూడండి:టీఆర్పీ స్కామ్ బట్టబయలు- 3 ఛానళ్లపై కేసులు