తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భూకబ్జా ఆరోపణలతో ఆజాంఖాన్​పై ఈడీ​ కేసు - ఈడీ

వివాదాస్పద నేత, రాంపుర్​​ ఎంపీ ఆజాంఖాన్​పై ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్ క్రిమినల్​​ కేసు నమోదు చేసింది. పలు భూముల కబ్జా ఆరోపణల నేపథ్యంలో మనీలాండరింగ్ నియంత్రణ చట్టం కింద చర్యలకు ఉపక్రమించింది ఈడీ.

భూకబ్జా ఆరోపణలతో ఆజాంఖాన్​పై ఈడీ​ కేసు

By

Published : Aug 1, 2019, 11:32 PM IST

భూకబ్జా ఆరోపణలతో ఆజాంఖాన్​పై ఈడీ​ కేసు

సమాజ్​వాదీ నేత, ఉత్తరప్రదేశ్​ రాంపుల్​ ఎంపీ ఆజాంఖాన్​ మరో వివాదంలో ఇరుక్కున్నారు. యూపీలో పలు భూముల కబ్జాలకు సంబంధించిన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఖాన్​పై క్రిమినల్​ కేసు నమోదు చేసింది ఈడీ. మనీలాండరింగ్​ నియంత్రణ చట్టం కింద చర్యలకు ఉపక్రమించింది.

యూపీలో ఆజాంఖాన్​పై సుమారు 26 పోలీసు కేసులు నమోదయినట్లు ఈసీఐఆర్​ (ఈడీ ఎఫ్​ఐఆర్)లో ఈడీ పేర్కొంది. బాధితుల నుంచి బలవంతంగా భూములను లాక్కున్నట్లు ఆజాంఖాన్​తో పాటు మరి కొంత మందిపై ఆరోపణలు ఉన్నాయి.

ఇదీ చూడండి: కర్ణాటక అసెంబ్లీ ఉప ఎన్నికలపై కేపీసీసీ కసరత్తు

ABOUT THE AUTHOR

...view details