తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఏజేఎల్​ కేసులో ఇద్దరు కాంగ్రెస్ నేతలపై ఛార్జిషీట్​

ఏజేఎల్​ భూకేటాయింపులకు సంబంధించిన కేసులో కాంగ్రెస్​ సీనియర్​ నేతలపై ఈడీ అభియోగ పత్రం దాఖలు చేసింది. ఈ కేసులో మొదటిసారి ఛార్జిషీటు దాఖలు చేసిన ఈడీ.. కాంగ్రెస్ సీనియర్ నేత మోతీలాల్​ వోరా, హరియాణా మాజీ సీఎం భూపేందర్​ సింగ్​ హుడా పేర్లను చేర్చింది.

ఏజేఎల్​ కేసులో ఇద్దరు కాంగ్రెస్ నేతలపై ఛార్జిషీట్​

By

Published : Aug 27, 2019, 5:11 AM IST

Updated : Sep 28, 2019, 10:11 AM IST

అసోసియేట్​ జర్నల్స్​ లిమిటెడ్​ (ఏజేఎల్​)​​ కేసులో మొదటిసారి అభియోగ పత్రం దాఖలు చేసింది ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​. 1992లో జరిగిన భూకేటాయింపులకు సంబంధించి కాంగ్రెస్ సీనియర్​ నేత మోతీలాల్​ వోరా, హరియాణా మాజీ సీఎం భూపేందర్​సింగ్ హుడా పేర్లను ఛార్జిషీటులో చేర్చింది ఈడీ.

ఛండీగఢ్​ సమీపంలోని పంచకులలో ఏజేఎల్​ సంస్థకు భూములను కేటాయించారు. ఈ వ్యవహారంలో అవకతవకలు జరిగాయని మనీలాండరింగ్​ నియంత్రణ చట్టం కింద ఈడీ కేసు నమోదు చేసింది. ఈ కేసుకు సంబంధించి వోరా, హుడాలకు ప్రత్యక్ష పాత్ర ఉందని ఈడీ ఆరోపించింది. ఈ విషయంలో సీబీఐ కూడా ఇప్పటికే కేసు నమోదు చేసి విచారిస్తోంది.

ఇదీ కేసు

1982లో ఏజేఎల్​కు హిందీ పత్రిక 'నవజీవన్​' నడపడానికి పంచకులలోని స్థలాన్ని కేటాయించారు. అయితే 1992 వరకు అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదు. ఫలితంగా హరియాణా పట్టణాభివృద్ధి సంస్థ (హెచ్​యూడీఏ) ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకుంది.

హరియాణా బీజేపీ నాయకుల విజ్ఞప్తితో సీబీఐ ఎఫ్​ఐఆర్ ఆధారంగా... 2016లో ఈడీ కూడా పీఎమ్​ఎల్​ఏ చట్టం కింద కేసు నమోదు చేసింది.

ఇదీ చూడండి: 'ఏజేఎల్​' ప్లాట్​ స్వాధీనానికి ఈడీ సమాయత్తం

Last Updated : Sep 28, 2019, 10:11 AM IST

ABOUT THE AUTHOR

...view details