మనీ లాండరింగ్ కేసులో నిందితులైన వ్యాపారవేత్తలు నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీలకు చెందిన విలువైన వస్తువులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీరిద్దరికి సంబంధించిన 2,300 కిలోలకు పైబడిన పాలిష్ చేసిన వజ్రాలు, ముత్యాలు, వెండి వస్తువులను అధికారులు బుధవారం హాంకాంగ్ నుంచి భారత్‌కు తీసుకువచ్చారు. వీటి విలువ రూ.1350 కోట్లు ఉంటుందని పేర్కొన్నారు.
రూ.1350 కోట్ల ఆస్తులు స్వాధీనం - నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీలకు చెందిన వజ్రాలను స్వాధీనం చేసుకున్న ఈడీ
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్.. అక్రమ నగదు చలామణి కేసులో నిందితులైన నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీలకు చెందిన రూ.1350 కోట్ల ఆస్తులను స్వాధీనం చేసుకుంది. ఇందులో వజ్రాలు, ముత్యాలు, వెండి వస్తువులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీలకు చెందిన రూ.1350 కోట్ల ఆస్తులు స్వాధీనం చేసుకున్న ఈడీ
2018లో నీరవ్, చోక్సీలు ఈ వస్తువులను దుబాయి నుంచి హాంకాంగ్‌కు తరలించి అక్కడ రహస్యంగా దాచి ఉంచారు. ఈ విషయాన్ని పసిగట్టిన ఈడీ అధికారులు హాంకాంగ్‌తో నిరంతరం సంప్రదింపులు జరిపి వాటిని వెనక్కు తీసుకురాగలిగారు.
ఇదీ చూడండి:గుజరాత్‌పై ఉగ్రగురి.. అప్రమత్తమైన పోలీసులు