నేషనల్ కాన్ఫెరెన్స్ పార్టీ అధినేత, జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా సహా మరికొందరి ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శనివారం జప్తుచేసింది. జమ్ము కశ్మీర్ క్రికెట్ సంఘంలో ఆర్థిక అవకతవకలకు సంబంధించి ఓ హవాల కేసులో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
ఫరూక్ అబ్దుల్లా ఆస్తులను జప్తు చేసిన ఈడీ - ఫరూక్ అబ్దుల్లా
జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా ఆస్తులను జప్తు చేసింది ఈడీ. జమ్ముకశ్మీర్ క్రికెట్ సంఘానికి సంబంధించిన అక్రమాల ఆరోపణ కేసులో ఈ చర్యలు తీసుకుంది.
ED attaches Rs 11.86 cr assets of Farooq Abdullah, others in JKCA money laundering case
జమ్ము, శ్రీనగర్‌లో రూ.11.86 కోట్లు విలువ చేసే ఆస్తులను ఈడీ స్వాధీనం చేసుకుంది. అయితే వాటి మార్కెట్ విలువ రూ.60కోట్ల పైనే ఉంటుందని తెలుస్తోంది. ఈ కేసులో ఫరూక్‌ను ఇదివరకే పలుమార్లు ఈడీ ప్రశ్నించింది.
ఇదీ చూడండి: మళ్లీ ఉగ్రవాదంవైపు కశ్మీరీ యువత- నెలకు 12మంది!