తెలంగాణ

telangana

ETV Bharat / bharat

హవాలా కేసులో సీఎం మేనల్లుడు అరెస్ట్ - ED arrests Ratul Puri

బ్యాంకులను మోసం చేసి రూ.354 కోట్ల అక్రమ నగదు చలామణికి పాల్పడిన ఆరోపణలపై వ్యాపారవేత్త రతుల్​పూరిని ఈడీ అదుపులోకి తీసుకుంది. నేడు ఆయనను ప్రత్యేక న్యాయస్థానం ముందు హాజరుపరచనుంది. అగస్టా వెస్ట్​లాండ్ వీవీఐపీ ఛాపర్​ కుంభకోణం కేసులోనూ రతుల్​పై ఈడీ నిఘా ఉంచింది.

హవాలా కేసులో రతుల్​పూరి అరెస్టు

By

Published : Aug 20, 2019, 11:14 AM IST

Updated : Sep 27, 2019, 3:23 PM IST

మధ్యప్రదేశ్​ ముఖ్యమంత్రి కమల్​నాథ్ మేనల్లుడు, వ్యాపారవేత్త రతుల్​పూరిని.. ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. బ్యాంకులను మోసం చేసి రూ.354 కోట్ల అక్రమ నగదు చలామణికి పాల్పడినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి.

ఈడీ ఇవాళ రతుల్​పూరిని న్యాయస్థానం ముందు హాజరుపరచనుంది. ఈ కేసు విచారణలో రతుల్​ తన సహకారం అందించని నేపథ్యంలో కస్టోడియల్ విచారణకు అనుమతించమని న్యాయస్థానాన్ని కోరనుంది.

ఈ కేసులోనే ఈ నెల 18న కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)... పూరికి సంబంధించిన ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించింది. అతని తల్లిదండ్రులు, నీతాపూరి, దీపక్​పూరిలపై క్రిమినల్ కేసులు నమోదు చేసింది. ఆ తరువాత ఇదే కేసులో రతుల్​కు సమన్లు జారీ చేసిన ఈడీ నిన్న ఆయన్ను అదుపులోకి తీసుకుంది. అగస్టా వెస్ట్​లాండ్... వీవీఐపీ ఛాపర్​ కుంభకోణం కేసులోనూ రతుల్​పై ఈడీ నిఘా ఉంచింది.

ఇదీ చూడండి: నేడు రాజీవ్​గాంధీ జయంతి.. ప్రముఖుల ఘన నివాళి

Last Updated : Sep 27, 2019, 3:23 PM IST

ABOUT THE AUTHOR

...view details