4,300 కోట్ల రూపాయల పీఎంసీ బ్యాంక్ కుంభకోణానికి సంబంధించి వివా గ్రూప్‌నకు చెందిన ఇద్దరిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. వివా గ్రూప్ అధినేత, మహారాష్ట్ర ఎమ్మెల్యే హితేంద్రఠాకూర్, ఇద్దరు సహాయకులకు చెందిన 5 నివాసాలు, కార్యాలయాల్లో శుక్రవారం ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు.
పీఎంసీ కుంభకోణం కేసులో ఇద్దరు అరెస్టు
వేల కోట్ల పీఎంసీ బ్యాంకు కుంభకోణానికి సంబంధించి వివా గ్రూప్‌నకు చెందిన ఇద్దరిని శనివారం అరెస్టు చేసింది ఈడీ. శుక్రవారం చేపట్టిన సోదాల్లో 74 లక్షల రూపాయలు, కొన్ని డాక్యుమెంటరీ ఆధారాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది.
పీఎంసీ కుంభకోణం కేసులో ఇద్దరు అరెస్టు: ఈడీ
ఈ నేపథ్యంలో వివా గ్రూప్ ఎండీ మెహుల్ ఠాకూర్, చార్టెడ్ అకౌంటెంట్ గోపాల్ చతుర్వేదిని అరెస్ట్ చేశారు. దర్యాప్తునకు సహకరించనందుకు వారిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వీరిని కోర్టులో హాజరుపర్చిన తర్వాత కస్టడీకి కోరనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. శుక్రవారం నిర్వహించిన సోదాల్లో 74 లక్షల రూపాయల నగదుతోపాటు డిజిటల్, డాక్యుమెంటరీ ఆధారాలను ఈడీ స్వాధీనం చేసుకుంది.
ఇదీ చదవండి:అసోంలో భూమి పట్టాలు పంపిణీ చేసిన ప్రధాని