తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'అది 'యాక్ట్​ ఆఫ్​ గాడ్'​ కాదు.. ప్రభుత్వ వైఫల్యమే' - Rahul latest news

దేశ ఆర్థిక వ్యవస్థపై నిర్మలా సీతారమన్​ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా విమర్శించారు రాహుల్​ గాంధీ. ఆర్థిక వ్యవస్థ నాశనమవ్వడానికి నోట్లరద్దు, జీఎస్​టీలో లోపాలు, లాక్​డౌన్​ వైఫల్యాలే కారణమని కాంగ్రెస్​ సీనియర్​ నేత మండిపడ్డారు.

Economy destroyed by demonetisation, 'flawed' GST', 'failed' lockdown: Rahul on FM's 'Act of God' remark
'అది 'యాక్ట్​ ఆఫ్​ గాడ్'​ కాదు.. ప్రభుత్వ వైఫల్యమే'

By

Published : Aug 29, 2020, 5:04 AM IST

కరోనా సంక్షోభంతో తీవ్రంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను 'యాక్ట్​ ఆఫ్​ గాడ్​'గా అభివర్ణించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్​పై కాంగ్రెస్​ సీనియర్​ నేత రాహుల్​ గాంధీ మండిపడ్డారు. ఆర్థిక వ్యవస్థ నాశనమవ్వడానికి నోట్లరద్దు, జీఎస్​టీలో లోపాలు, లాక్​డౌన్​ వైఫల్యాలే కారణమని ట్వీట్​ చేశారు.

"మూడు కారణాల వల్లే దేశ ఆర్థిక వ్యవస్థ నాశనమైంది. 1. నోట్లరద్దు 2. జీఎస్​టీలో లోపాలు 3. లాక్​డౌన్​ వైఫల్యం. మిగితావన్ని ఓ అబద్ధం."

--- రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ సీనియర్​ నేత.

ఈ ట్వీట్​తో పాటు.. నిర్మలా సీతారామన్​ వ్యాఖ్యలకు సంబంధించిన ఓ వార్తా కథనాన్ని జోడించారు రాహుల్​.

ఆర్థిక వ్యవస్థపై కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై గత కొంతకాలంగా రాహుల్​ గాంధీ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అదే సమయంలో కరోనా వైఫల్యం, చైనాతో సరిహద్దు వివాదం అంశాల్లో కేంద్రంపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నారు.

ఇవీ చూడండి:-

ABOUT THE AUTHOR

...view details