'ఆర్థిక వ్యవస్థ పతనంపై ప్రజల్లో భయాందోళనలు' దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతోందని ఆందోళన వ్యక్తంచేశారు మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబంరం. ప్రస్తుత పరిస్థితికి మోదీ ప్రభుత్వ అసమర్థతే కారణమని ఆరోపించారు. ఆర్థిక వ్యవస్థపై దేశంలో భయాందోళనలు, అనిశ్చితి నెలకొన్నాయని అన్నారు.
కేంద్ర బడ్జెట్‌పై చర్చ సందర్భంగా రాజ్యసభలో ప్రసంగించారు చిదంబరం. నిరుద్యోగం పెరగడం, వినియోగం తగ్గడం భారత్‌ను పేదరికంలోకి నెడుతున్నాయని చెప్పారు.
భాజపా ప్రభుత్వానికి నాలుగేళ్లుగా ఆర్థిక సలహాదారుగా ఉన్న అరవింద్ సుబ్రహ్మణియనే... ఆర్థిక వ్యవస్థ ఐసీయూలో ఉందన్నారని గుర్తు చేశారు చిదంబరం. కానీ తన దృష్టిలో... ఈసీయూలో లేని పేషంట్ కోసం అసమర్థ వైద్యులు వెతుకుతున్నట్లు ఉందని దుయ్యబట్టారు.
ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రతిపక్షాల నుంచి సలహాలు సూచనలు తీసుకునే విషయంపై కేంద్ర కనీసం ఆలోచన కూడా చేయడం లేదని విమర్శించారు చిదంబరం. ప్రజల చేతుల్లో డబ్బు పెట్టడానికి బదులు కార్పోరేట్లకు కేంద్రం సాయం చేస్తోందని ఆరోపించారు.
"ఎన్ఎస్ఎస్ఓ వినియోగదారుల వ్యయంపై సర్వే చేసింది. అది 3 నెలలకు ఒకసారి నవీకరించాలి. 2011-12 నుంచి 2017-18 మధ్య వినియోగం 3.8 శాతం తగ్గింది. గ్రామీణ వినియోగం 8.8 శాతం తగ్గింది. గ్రామీణ ఆహార వినియోగం 10 శాతం తగ్గింది. అసమానతలో పేదరికాన్ని లెక్కించడానికి వినియోగంపై జరిగే సర్వేలు ఉపయోగపడతాయి. ఇవి ప్రపంచంలోని చాలా దేశాల్లో జరుగుతాయి. మీరు వినియోగానికి సంబంధించి సర్వే చేసిన గణాంకాలను బయటపెట్టేందుకు విముఖత చూపుతున్నారు."
-పి. చిదంబరం, మాజీ ఆర్థిక మంత్రి.
ఇదీ చూడండి: రిజర్వేషన్లు రద్దు చేయడమే వారి లక్ష్యం: రాహుల్