ప్లాస్టిక్‌తో ఇటుకలను తయారు చేయగలరా? అది కూడా ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్‌తో? సాధ్యమే కాదు అనుకుంటున్నారా? అయితే మీరు పొరబడినట్టే. బంగాల్లోని బిష్ణుపుర్ జిల్లాకు చెందిన స్థానిక మున్సిపాలిటీ అధికారులు దీనిని చేసి చూపించారు.
మున్సిపాలిటీలోని సబ్-డివిజన్ అధికారి మానస్ మొండల్ ఆలోచనే ఇది. వాడిపడేసిన పాలిథీన్ కవర్లు, చెత్తను బాటిళ్లల్లో, జాడీల్లో నింపి ఇటుకల్లా తయారు చేయడం మొదలు పెట్టారు మానస్. ఇప్పుడు ఈ ఆలోచన స్థానికుల్లో ఉత్సాహం నింపింది.
"మున్సిపాలిటీ పరిధిలోని పాఠశాలలనే కాదు.. గ్రామాల్లోని బడులను వీటికి ఉపయోగిస్తున్నాం. ఈ ప్లాస్టిక్ భూతం వ్యవసాయ క్షేత్రాలకు ఎంతో నష్టం. వ్యవసాయ క్షేత్రాల్లో ఇది ఎన్నో సమస్యలు తెస్తుంది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. మీ వల్ల ఇంట్లో ప్లాస్టిక్‌ను వినియోగించలేకపోతున్నామని తల్లిదండ్రులు అంటున్నారు. ఇంట్లో ఉన్న ప్లాస్టిక్‌ను పిల్లలు బాటిళ్లల్లో పెడుతున్నారని చెబుతున్నారు." - మానస్ మొండల్, ఎస్డీఓ బిష్ణుపుర్