మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్నాథ్ అనుచిత వ్యాఖ్యలపై రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి(సీఈసీ)ని పూర్తి నివేదికను అందజేయాలని ఈసీఐ ఆదేశించింది. సీఈసీకి జాతీయ మహిళా కమిషన్ లేఖ రాసిన తర్వాత భారత ఎన్నికల సంఘం వివరణ కోరింది.
మధ్యప్రదేశ్ ఉప ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. కమల్నాథ్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర రాజకీయ దుమారం చెలరేగింది. కాంగ్రెస్ తరఫున ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించిన కమల్నాథ్.. భాజపా మహిళా అభ్యర్థి ఇమార్తీ దేవిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు.