తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఓటరు కార్డు ఇక డిజిటల్​ రూపంలో...

ఓటరు గుర్తింపు కార్డులను ఇకపై మొబైల్‌/కంప్యూటర్‌లో డౌన్‌లోడ్‌, సేవ్ చేసుకునేందుకు వీలు కల్పిస్తూ ఎలక్ట్రానిక్‌ వెర్షన్‌ ఓటరు ఐడీ కార్డులను అందుబాటులోకి తెచ్చింది ఈసీ.

EC toys with idea of digital voter ID card
ఇక డిజిటల్​ ఓటరు కార్డు.. ఆవిష్కరించిన ఈసీ

By

Published : Jan 25, 2021, 7:13 PM IST

జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ఎన్నికల సంఘం ఎలక్ట్రానిక్‌ ఓటరు గుర్తింపు కార్డులను పరిచయం చేసింది. ఈ డిజిటల్‌ కార్డును పీడీఎఫ్‌ ఫార్మాట్‌లో ప్రింట్‌ చేసుకోవచ్చు. అంతేగాక డిజీ లాకర్‌లోనూ సేవ్ చేసుకోవచ్చు.

ఓటరు ఐడీ కార్డును సత్వరమే ప్రజలకు అందించే ఉద్దేశంతోనే ఈ గుర్తింపు కార్డును రూపొందించినట్టు ఈసీ వెల్లడించింది. అవగాహన ఉన్నవారు మీ-సేవ కేంద్రాలకు వెళ్లకుండానే ఓటరు కార్డు తీసుకోవచ్చని తెలిపింది. ఈ మేరకు దిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ ఎలక్ట్రానిక్ ఓటరు కార్డులను ఆవిష్కరించారు. కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకున్న ఐదుగురికి డిజిటల్‌ కార్డులను మంత్రి అందజేశారు.

ఇక మరోవైపు రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ ఆన్​లైన్​ డిజిటల్​ రేడియోలో ఓటరు అవగాహనా కార్యక్రమం 'హలో ఓటర్స్'ను ప్రారంభించారు.

ఈ ఎన్నికల నుంచే..

త్వరలో ఎన్నికలు జరగనున్న బంగాల్​, తమిళనాడు, అసోం, కేరళ, పుదుచ్చేరి ఎన్నికల్లో ఈ-ఓటరు కార్డును ఉపయోగించుకోవచ్చని ప్రకటించింది ఈసీ. అయితే ఇప్పుడున్న కార్డులు కొనసాగుతాయని స్పష్టం చేసింది. ఆన్​లైన్​లో ఎలాంటి మార్పులు చేయడానికి వీల్లేకుండా వీటిని రూపొందించినట్లు తెలిపింది.

ఇప్పటికే ఆధార్‌, పాన్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌ వంటివి డిజిటల్‌ మోడ్​లో అందుబాటులో ఉండగా.. ఆ జాబితాలో ఓటరు గుర్తింపు కూడా చేరింది. 1993 నుంచి.. ఫొటోతో కూడిన ఓటరు కార్డునే గుర్తింపు కార్డుగా పరిగణిస్తోంది ఈసీ.
ఇదీ చదవండి : 'లైంగిక వేధింపులపై హైకోర్టు తీర్పు దారుణం'

ABOUT THE AUTHOR

...view details