తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'సమర భేరి' సాయంత్రమే...​ - శాసనసభ

సార్వత్రిక ఎన్నికలకు సాయంత్రం నగారా మోగనుంది. 5 గంటలకు షెడ్యూల్​ ప్రకటించనుంది ఈసీ. ఏప్రిల్​- మే నెలల్లో జరగనున్న ఈ ఎన్నికలను ఏడు లేదా ఎనిమిది విడతల్లో నిర్వహించనున్నారని సమాచారం.

సార్వత్రికానికి షెడ్యూల్​ కొద్దిగంటల్లో...

By

Published : Mar 10, 2019, 11:48 AM IST

Updated : Mar 10, 2019, 2:47 PM IST

సాయంత్రమే లోక్​సభ ఎన్నికల షెడ్యూల్​
యావద్దేశం ఆసక్తిగా ఎదురుచూస్తున్న సార్వత్రిక ఎన్నికల తేదీలపై సాయంత్రం ప్రకటన రానుంది. దిల్లీ విజ్ఞాన్​భవన్​లో 5 గంటలకు మీడియా సమావేశంలో ఎన్నికలపై పూర్తి స్పష్టతనివ్వనుంది కేంద్ర ఎన్నికల సంఘం.

ప్రస్తుత లోక్​సభ కాలపరిమితి జూన్​ 3తో ముగియనుంది.

షెడ్యూల్​ ప్రకటించిన తక్షణమే ఎన్నికల నిబంధనావళి​ అమల్లోకి రానుంది. మార్చి నెలాఖర్లో నోటిఫికేషన్​ విడుదలై, ఏప్రిల్​ మొదటి వారంలో తొలిదశ పోలింగ్​ జరిగే అవకాశముంది.

రాష్ట్రాలకూ....

ఎన్నికల సంఘం లోక్​సభతో పాటే నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్​ ప్రకటించే అవకాశముంది. ఆంధ్రప్రదేశ్​, ఒడిశా, సిక్కిం, అరుణాచల్​ప్రదేశ్​లో సార్వత్రికంతోటే పోలింగ్​ జరగనుంది. జమ్ముకశ్మీర్​ ఎన్నికలనూ 'లోక్​సభ' తో పాటే జరిపే యోచనలోనూ ఉంది ఈసీ.

జమ్ముకశ్మీర్​ అసెంబ్లీ రద్దయి ఆరు నెలల కాలం 'మే'తో ముగుస్తుంది. లోక్​సభతో పాటే ఎన్నికల నిర్వహణకు రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు సుముఖత వ్యక్తం చేశాయి. కాబట్టి జమ్ములోనూ ఎన్నికలు జరిగే అవకాశముంది. భారత్​- పాక్​ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో భద్రతను దృష్టిలో ఉంచుకొని షెడ్యూల్​ ప్రకటించనుంది ఈసీ.

జమ్ము అసెంబ్లీ ఆరు సంవత్సరాలు కాలపరిమితి 2021 మార్చి 16తోనే ముగియాల్సింది. భాజపా, పీపుల్స్​ డెమొక్రటిక్​ పార్టీ(పీడీఎఫ్​)ల మధ్య విభేదాలతో ముందే అసెంబ్లీ రద్దయింది.

సర్వం సిద్ధం!...

ఎన్నికలకు అవసరమయ్యే ఓటింగ్​ యంత్రాలు, పేపర్​ ట్రయల్​ మెషీన్లను సిద్ధంగా ఉంచింది ఈసీ. 543 లోక్​సభ నియోజకవర్గాల్లో దాదాపు 10 లక్షల పోలింగ్​ కేంద్రాల్లో ఎన్నికలకు సమాయత్తమైంది.

2014 సార్వత్రికానికి మార్చి 5న ఎన్నికల షెడ్యూల్​ ప్రకటించింది ఈసీ. ఏప్రిల్​- మే నెలల్లో 9 విడతల్లో పోలింగ్​ జరిగింది. తొలి దశ ఏప్రిల్ ​7న జరగగా, మే 12తో ఎన్నికలు ముగిశాయి. మే 16న ఫలితాలు వెలువడ్డాయి.

Last Updated : Mar 10, 2019, 2:47 PM IST

ABOUT THE AUTHOR

...view details