తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దిల్లీ నగారా​: ఫిబ్రవరి 8న పోలింగ్​- 11న ఫలితాలు - దిల్లీ వార్తలు

EC-DL-POLLS
EC-DL-POLLS

By

Published : Jan 6, 2020, 1:02 PM IST

Updated : Jan 6, 2020, 9:45 PM IST

15:54 January 06

దిల్లీ శాసనసభ ఎన్నికల షెడ్యూలును భారత ఎన్నికల అధికారి సునీల్ అరోడా విడుదల చేశారు. ఫిబ్రవరి 8న దిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్​ జరుగుతుందని తెలిపారు. వచ్చే నెల 11న ఓట్ల లెక్కింపు ఉంటుందన్నారు.

షెడ్యూల్​ ఇది..

  • జనవరి 12 - నోటిఫికేషన్​
  • జనవరి 14 - నామపత్రాలు దాఖలు ప్రారంభం
  • జనవరి 21 - నామపత్రాల దాఖలుకు చివరి గడువు
  • జనవరి 24  - నామపత్రాల ఉపసంహరణకు తుది గడువు
  • ఫిబ్రవరి 8   - పోలింగ్
  • ఫిబ్రవరి 11 - ఫలితాలు

ఈసీ లెక్కల ప్రకారం 2020 జనవరి 6 నాటికి దిల్లీలో 1,46,92,136 మంది ఓటర్లు ఉన్నారు. వీరికోసం 13,750 పోలింగ్​ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు అరోడా తెలిపారు. దిల్లీ ప్రస్తుత శాసనసభ గడువు ఫిబ్రవరి 22తో ముగియనుంది. 

ఈ ఎన్నికల్లో 'ఓటర్ల గైర్హాజరీ' అనే కొత్త విధానాన్ని ప్రవేశపెట్టనుంది ఈసీ. 

12:43 January 06

దిల్లీ శాసనసభ ఎన్నికల షెడ్యూలును భారత ఎన్నికల సంఘం నేడు విడుదల చేయనుంది. ఈ రోజు మధ్యాహ్నం 3.30 గంటలకు తేదీలు ప్రకటించనుంది ఈసీ. 

70 సభ్యులున్న దిల్లీ శాసనసభ గడువు ఫిబ్రవరి 22తో ముగియనుంది. అంతకుముందే కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది. 

Last Updated : Jan 6, 2020, 9:45 PM IST

ABOUT THE AUTHOR

...view details