తెలంగాణ

telangana

ETV Bharat / bharat

షాహీన్​బాగ్​ కాల్పుల నేపథ్యంలో డీసీపీపై బదిలీ వేటు - latest national update news

షాహీన్​బాగ్​, జామియా నగర్​లలో జరిగిన కాల్పుల ఘటనల కారణంగా.. దిల్లీ ఆగ్నేయ డీసీపీ చిన్మోయ్​ బిస్వాల్​ను బదిలీ చేసింది ఎన్నికల సంఘం. బిస్వాల్​ స్థానంలో సీనియర్​ అడిషనల్​ డీసీపీ కుమార్​ జ్ఞానేష్​ను బాధ్యతలు చేపట్టాల్సిందిగా ఈసీ ఆదేశించింది.

EC shunts DCP Chinmoy Biswal after firing incidents at Jamia Nagar, Shaheen Bagh
షాహీన్​బాగ్​ డీసీపై ఈసీ చర్యలు.. బదిలీ వేటు

By

Published : Feb 3, 2020, 5:25 AM IST

Updated : Feb 28, 2020, 11:12 PM IST

ఇటీవలే షాహీన్​బాగ్​, జామియా నగర్​లలో జరిగిన కాల్పుల ఘటనల నేపథ్యంలో.. దిల్లీ ఆగ్నేయ డీసీపీ చిన్మోయ్​ బిస్వాల్​పై ఎన్నికల సంఘం చర్యలకు ఉపక్రమించింది.​ ఆ ప్రాంతాల్లో బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ సరైన చర్యలు తీసుకోకపోవడం వల్ల బిస్వాల్​ను బదిలీ చేస్తున్నట్లు ఈసీ స్పష్టం చేసింది. బిస్వాల్​ స్థానంలో సీనియర్​ అడిషనల్​ డీసీపీ కుమార్​ జ్ఞానేష్​ను బాధ్యతలు తీసుకోవాల్సిందిగా ఈసీ ఆదేశించింది.

ఏం జరిగింది?

జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయం ఎదుట సీఏఏకు వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతన్నవిద్యార్థులపైజనవరి 30న ఓ యువకుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఓ విద్యార్థి గాయపడ్డాడు. అనంతరం దాడికి పాల్పడిన వ్యక్తి పోలీసులకు లొంగిపోయాడు.

ఈ ఘటన జరిగిన రెండు రోజుల అనంతరం.. సీఏఏ నిరసనలకు కేంద్రంగా మారిన షాహీన్​బాగ్​లో మరో వ్యక్తి కాల్పులతో కలకలం రేపాడు. ఈ నేపథ్యంలోనే బిస్వాల్​ను ఈసీ బదిలీ చేసింది.

Last Updated : Feb 28, 2020, 11:12 PM IST

ABOUT THE AUTHOR

...view details