ఎన్నికల వేళ అక్రమార్కులపై ఎన్నికల సంఘం కొరడా ఝుళిపిస్తోంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి ఏప్రిల్ 1 నాటికి దేశవ్యాప్తంగా రూ.1460 కోట్లు విలువచేసే అక్రమ నగదు, మద్యం, మత్తుపదార్థాలను స్వాధీనం చేసుకుంది. ఇందులో అత్యధికంగా గుజరాత్లో రూ.509 కోట్ల నగదు, మరో రూ.500 కోట్లు విలువచేసే మత్తుపదార్థాలను జప్తు చేసినట్లు అధికారులు తెలిపారు.
తమిళనాడు(రూ.208.55 కోట్లు), ఆంధ్రప్రదేశ్(రూ.158.61 కోట్లు), పంజాబ్(రూ.144.39 కోట్లు), ఉత్తరప్రదేశ్(రూ.135.13 కోట్లు) రాష్ట్రాలు వరుసగా ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.