తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఎన్నికల వేళ భారీగా నగదు, మద్యం స్వాధీనం - Tamilnadu

ఎన్నికలు సమీపిస్తున్నందున దేశవ్యాప్తంగా అక్రమ నగదు, మద్యం పంపిణీపై నిఘాను మరింత పెంచింది ఈసీ. ఎన్నికల షెడ్యూల్​ విడుదలైనప్పటి నుంచి నేటికి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కలిపి రూ.1551 కోట్లు విలువచేసే అక్రమ నగదు, మద్యం, లోహాలు, మత్తుపదార్థాలు జప్తు చేసింది.

అక్రమార్కులపై ఈసీ కొరడా

By

Published : Apr 4, 2019, 12:39 PM IST

Updated : Apr 4, 2019, 1:30 PM IST

ఎన్నికల అక్రమార్కులపై ఈసీ(ఎన్నికలసంఘం) కొరడా ఝుళిపిస్తోంది. షెడ్యూల్​ విడుదలైనప్పటి నుంచి నేటికి (ఏప్రిల్​ 4) దేశవ్యాప్తంగా రూ.377.511 కోట్ల అక్రమ నగదు, రూ.157 కోట్లు విలువ చేసే మద్యం, రూ.705 కోట్ల విలువైన మత్తుపదార్థాలు, రూ.312 కోట్లు విలువైన లోహాలను జప్తు చేసింది. మొత్తంగా రూ.1551 కోట్ల విలువైన నగదు,వస్తువులను స్వాధీనం చేసుకుంది.

ఇందులో అత్యధికంగా గుజరాత్​లో రూ.9 కోట్ల నగదు, రూ.500 కోట్లు విలువచేసే మత్తుపదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

తమిళనాడు(రూ.208.55 కోట్లు), ఆంధ్రప్రదేశ్​(రూ.158.61 కోట్లు), పంజాబ్​(రూ.144.39 కోట్లు), ఉత్తరప్రదేశ్​(రూ.135.13 కోట్లు) రాష్ట్రాలు వరుసగా ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.

పట్టుబడ్డ నగదుకు సరైన పత్రాలు చూపితే డబ్బును తిరిగి ఇస్తామని అధికారులు తెలిపారు.

ఈనెల 11న సార్వత్రిక ఎన్నికల తొలి దశ పోలింగ్​ జరగనుంది.

Last Updated : Apr 4, 2019, 1:30 PM IST

ABOUT THE AUTHOR

...view details