తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఈసీ కొరడా : భారీగా అక్రమ నగదు, మద్యం సీజ్

సార్వత్రిక ఎన్నికల వేళ అక్రమార్కులపై ఎన్నికల సంఘం కొరడా ఝుళిపించింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 540 కోట్ల రూపాయల విలువైన అక్రమ నగదు, మద్యం, మత్తు పదార్థాలు, ఖరీదైన లోహాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది ఈసీ.

దేశవ్యాప్తంగా భారీగా నగదు,మద్యం పట్టుకున్న ఈసీ

By

Published : Mar 26, 2019, 4:50 PM IST

Updated : Mar 26, 2019, 7:03 PM IST

దేశవ్యాప్తంగా భారీగా నగదు,మద్యం పట్టుకున్న ఈసీ
లోక్​సభ ఎన్నికల ముందు భారీగా అక్రమ నగదు, మద్యం స్వాధీనం చేసుకున్నారు ఎన్నికల సంఘం అధికారులు. ఎన్నికల షెడ్యూల్​ విడుదలైనప్పటి నుంచి దేశవ్యాప్తంగా ఈ నెల 25వ తేదీ నాటికి... 540 కోట్ల రూపాయల విలువైన అక్రమ నగదు, మద్యం, మత్తు పదార్థాలు, ఖరీదైన లోహాలను జప్తు చేసినట్లు సీఈసీ తెలిపింది.

ఇందులో అత్యధికంగా తమిళనాడులో రూ.107.24 కోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్​(రూ.104.53 కోట్లు), ఆంధ్రప్రదేశ్​(రూ.103.4 కోట్లు), కర్ణాటక(రూ.26.53 కోట్లు), మహారాష్ట్ర (రూ. 19.11 కోట్లు), తెలంగాణ(రూ.8.2 కోట్లు) రాష్ట్రాలు ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.

అక్రమంగా తరలిస్తున్న రూ.143.47 కోట్ల నగదు, రూ. 89.64 కోట్ల విలువైన మద్యం, రూ.131.75 కోట్ల విలువ చేసే మత్తుపదార్థాలు, రూ. 162.93 కోట్ల విలువైన లోహాలు, రూ. 12.202 కోట్ల విలువైన ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు ప్రకటించారు.

Last Updated : Mar 26, 2019, 7:03 PM IST

ABOUT THE AUTHOR

...view details