కాంగ్రెస్ నాయకుడు, పంజాబ్ మంత్రి నవ్జోత్ సింగ్ సిద్ధూపై ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. బిహార్ కటిహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మతపరమైన వ్యాఖ్యలు చేశారని ఈసీ దృష్టికి వచ్చింది. నేతల ప్రచారాలపై ఇటీవల కఠినంగా వ్యవహరిస్తోన్న ఎన్నికల సంఘం సిద్ధూకి షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో సిద్ధూ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని ఈసీ పేర్కొంది. అలాగే రాజకీయ ప్రచారాల్లో మతపరమైన వ్యాఖ్యలపై నిషేధం విధించిన సుప్రీం కోర్టు ఆదేశాలను సైతం ఉల్లంఘించారని తెలిపింది.