తెలంగాణ

telangana

ETV Bharat / bharat

చౌకీదార్​ కప్పులపై రైల్వేకు ఈసీ నోటీసులు - irctc

టీ కప్పులపై 'నేనూ కాపలాదారునే' నినాదం వ్యవహారంలో రైల్వే శాఖపై చర్యలు చేపట్టింది భారత ఎన్నికల సంఘం. ఎన్నికల నియమావళి ఉల్లంఘనపై వివరణ ఇవ్వాలని షోకాజ్​ నోటీసులు జారీ చేసింది.

టీ కప్పులపై మోదీ నినాదంతో మరోసారి చిక్కుల్లో రైల్వే

By

Published : Mar 30, 2019, 4:58 PM IST

'నేనూ కాపలాదారునే' నినాదం రైల్వే టీ కప్పులపై దర్శనమివ్వడాన్ని తీవ్రంగా పరిగణించింది ఎన్నికల సంఘం. ఇది ఎన్నికల నియమావళి ఉల్లంఘన కిందకే వస్తుందని.. రైల్వే శాఖపై చర్యలకు ఉపక్రమించింది. వివరణ ఇవ్వాల్సిందింగా షోకాజ్​ నోటీసులు జారీ చేసింది. ప్రధాని మోదీ చిత్రాలతో టికెట్లు ఇచ్చి ఇటీవల ఎన్నికల నియమావళి ఉల్లంఘించింది రైల్వే శాఖ.

టీ కప్పుపై చౌకీదార్​ నినాదం ఉన్న ఫొటోను ఓ ప్రయాణికుడు ట్వీట్​ చేయటం... నెట్టింట్లో వైరల్​గా మారడం చకచకా జరిగిపోయాయి.

ఇది ఉద్దేశపూర్వకం కాదని.. అనుకోని తప్పిదమని పేర్కొంది భారతీయ రైల్వే.

ఇదీ చూడండీ: రైల్వే టీ కప్పులపై 'చౌకీదార్'​ రగడ

ABOUT THE AUTHOR

...view details