ETV Bharat Telangana

తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'టికెట్లపై మోదీ చిత్రాలు తీసేయలేదేం?' - గుజరాత్​ ముఖ్యమంత్రి విజయ్​ రూపానీ

సార్వత్రిక ఎన్నికల వేళ రైల్వే, ఎయిర్ ఇండియా బోర్డింగ్​ పాస్​ల మీద మోదీ చిత్రాలు తీసేయకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనపై తాజాగా ఈ రెండు మంత్రిత్వశాఖలకు ఈసీ నోటీసులు జారీ చేసింది.

భారత ఎన్నికల సంఘం
author img

By

Published : Mar 27, 2019, 3:09 PM IST

Updated : Mar 27, 2019, 3:37 PM IST

'టికెట్లపై మోదీ చిత్రాలు తీసేయలేదేం?'

ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనపై రైల్వే, పౌర విమానయాన మంత్రిత్వశాఖలకు ఎన్నికల సంఘం షోకాజ్​ నోటీసులు జారీ చేసింది. ఎన్నికల కోడ్​ అమల్లో ఉన్నప్పటికీ రైల్వే టికెట్లు, ఎయిర్ ఇండియా బోర్డింగ్ పాసులపై ప్రధాని నరేంద్ర మోదీ చిత్రాలు ఎందుకు తొలగించలేదని ప్రశ్నించింది. మూడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

ప్రజాధనంతో ప్రచారమా?

ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా రైల్వే టికెట్లపై ప్రధాని మోదీ చిత్రం ఉండడంపై తృణమూల్​ కాంగ్రెస్​ అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రజాధనంతో మోదీ చిత్రాలను ఎలా ముద్రిస్తారని విమర్శించింది. ఈ చర్యలు ఓటర్లపై ప్రభావం చూపుతాయని అభిప్రాయపడింది. బోర్డింగ్​ పాస్​లపై నాయకుల చిత్రాలు ఉండడంపై పంజాబ్​ మాజీ డీజీపీ శశికాంత్ అభ్యంతరం వ్యక్తం చేశారు. విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఈసీ తక్షణ చర్యలకు ఉపక్రమించింది.

వెనక్కు తీసుకుంటాం..

రైల్వే టికెట్లపై మోదీ చిత్రం పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ ప్రచారంలో భాగంగా ముద్రించారు. దీనిపై అభ్యంతరాలు, విమర్శలు వెల్లువెత్తి వాటిని వెనక్కు తీసుకుంటున్నట్లు గత వారమే నిర్ణయం తీసుకున్నామని రైల్వే మంత్రిత్వశాఖ అధికారులు తెలిపారు.

థర్డ్​ పార్టీ ఎడ్వర్టైజ్​మెంట్లు...

ఎయిర్​ ఇండియా బోర్డింగ్​ పాస్​లపై ఉన్న ప్రధాని మోదీ, గుజరాత్​ ముఖ్యమంత్రి విజయ్​ రూపానీ చిత్రాలు థర్డ్​ పార్టీ ఎడ్వర్టైజ్​మెంట్​లకు సంబంధించినవని పౌర విమానయాన మంత్రిత్వశాఖ తెలిపింది. ఎన్నిక ప్రవర్తన నియమావళికి విరుద్ధంగా ఉంటే వాటిని తొలగించడానికి అభ్యంతరం లేదని తెలిపింది.

ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికలు ఏప్రిల్​ 11 నుంచి విడతల వారీగా జరుగుతాయని ప్రకటించింది. మార్చి 10 నుంచి ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది.

ఇదీ చూడండి :'నరేంద్ర మోదీ' చిత్ర నిర్మాతలకు నోటీసులు

Last Updated : Mar 27, 2019, 3:37 PM IST

ABOUT THE AUTHOR

...view details