80ఏళ్లు పైబడినవారు, దివ్యాంగులు.. ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే ప్రక్రియను ఎన్నికల సంఘం మరింత సులభతరం చేసింది. ఇందుకోసం కొత్త సూచనలతో కూడిన లేఖను అన్ని రాష్ట్రాల ముఖ్య ఎన్నికల అధికారులకు పంపించింది.
పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేందుకు కావాల్సిన పత్రాలను.. 80ఏళ్లు పైబడినవారు, దివ్యాంగులకు స్వయంగా బూత్ స్థాయి అధికారే(బీఎల్ఓ) వారి ఇంటికి వెళ్లి అందించనున్నారు.
"వీరు ఒకవేళ పోస్టల్ బ్యాలెట్‌ను ఎంచుకుంటే.. బీఎల్ఓ.. ఓటర్ ఇంటి నుంచే 12-డీ పత్రాన్ని సేకరిస్తారు. నోటిఫికేషన్ విడుదలైన ఐదురోజుల లోపు ఇది జరుగుతుంది. అనంతరం రిటర్నింగ్ ఆఫీసర్‌కు ఈ పత్రాలను అందిస్తారు."