తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'అనురాగ్​ ఠాకూర్'​కు ఈసీ షోకాజ్​ నోటీసులు

భాజపా ఎంపీ అనురాగ్​ ఠాకూర్​కు ఎన్నికల సంఘం షోకాజ్​ నోటీసులు జారీ చేసింది. దిల్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై ఈ చర్యలు తీసుకుంది ఈసీ.

EC issues show cause notice to Union min Anurag Thakur over controversial remark
అనురాగ్​ ఠాకూర్​కు ఈసీ షోకాజ్​ నోటీసు

By

Published : Jan 28, 2020, 9:21 PM IST

Updated : Feb 28, 2020, 8:02 AM IST

భాజపా ఎంపీ, కేంద్ర మంత్రి అనురాగ్​ ఠాకూర్​కు షోకాజ్​ నోటీసులు జారీ చేసింది ఎన్నికల సంఘం. దిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారనే ఆరపణలపై ఈ చర్యలు తీసుకుంది ఈసీ. నోటీసులపై జనవరి 30 మధ్యాహ్నం 12 గంటలలోపు స్పందన తెలపాలని ఆదేశించింది. దిల్లీ ఎన్నికల ప్రధాన అధికారి... ఈ విషయంపై ఈసీకి నివేదిక సమర్పించిన తర్వాత ఠాకూర్​కు నోటీసు అందింది.

ఏం అన్నారు?..

దిల్లీలో ఫిబ్రవరి 8న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. భాజపా అభ్యర్థి తరఫున సోమవారం ప్రచారం చేశారు అనురాగ్​ ఠాకూర్​. సీఏఏను వ్యతిరేకిస్తున్న వారిపై విరుచుకుపడ్డారు. అలాంటి వారిని దేశద్రోహులుగా పరిగణించి కాల్చేయాలని ఆరోపించారు.

Last Updated : Feb 28, 2020, 8:02 AM IST

ABOUT THE AUTHOR

...view details