తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బిహార్: ఎన్నికల ప్రచారానికి బ్రాడ్​కాస్ట్ సమయం రెట్టింపు - broadcast time for bihar political parties

పరోక్ష ఎన్నికల ప్రచారాలను ప్రోత్సహించేందుకు బిహార్‌లో రాజకీయ పార్టీల బ్రాడ్‌కాస్ట్‌, టెలికాస్ట్‌ సమయాన్ని పెంచుతూ ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. రాజకీయ పార్టీలకు కేటాయించిన సమయాన్ని రెట్టింపు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీని ప్రకారం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు.. దూరదర్శన్‌, ఆల్‌ ఇండియా రేడియో ద్వారా 90 నిమిషాల పాటు ఎన్నికల ప్రచారాలను చేసుకునే వెసులుబాటు ఉంటుంది.

ec-doubles-broadcast-time-for-parties-on-dd-air-for-bihar-polls
బిహార్: ఎన్నికల ప్రచారానికి బ్రాడ్​కాస్ట్ సమయం రెట్టింపు

By

Published : Oct 11, 2020, 9:06 AM IST

బిహార్‌ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీలకు కేటాయించిన బ్రాడ్‌కాస్ట్‌, టెలికాస్ట్‌ సమయాన్ని రెట్టింపు చేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌(ఈసీ) ఆదేశాలు జారీ చేసింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో పరోక్ష ఎన్నికల ప్రచారాన్ని ప్రోత్సహించేందుకు గాను ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ప్రసార సమయం పెంపు కేవలం గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర పార్టీలకే వర్తిస్తుందని ఈసీ స్పష్టం చేసింది.

దీని ప్రకారం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు.. దూరదర్శన్‌, ఆలిండియా రేడియో ద్వారా 90 నిమిషాల పాటు ఎన్నికల ప్రచారాలను చేసుకునే వెసులుబాటు ఉంటుంది. నామినేషన్‌ ప్రక్రియ ముగిసిన తేది నుంచి పోలింగ్‌కు రెండు రోజుల ముందు వరకు ఆయా రాజకీయ పార్టీలు ప్రచారం చేసుకోవచ్చని ఈసీ పేర్కొంది.

బిహార్: ఎన్నికల ప్రచారానికి బ్రాడ్​కాస్ట్ సమయం రెట్టింపు

ఇదీ చదవండి-'నితీశ్​ కుమార్.. నా తండ్రిని అవమానించారు'

ABOUT THE AUTHOR

...view details